సిల్వర్ స్క్రీన్ మీద ‘నూతన్’ నాయుడు



Nutan Naidu on Silver Screen

అదిరిపోయే టైమింగ్ తో, వండర్ ఫుల్ రైమింగ్ తో బిగ్ బాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నూతన్ నాయుడు ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద కూడా కనిపించబోతున్నాడట. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న మల్టీ స్టారర్ మూవీ f2 – ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ లో నూతన్ నాయుడు కీలకమైన పాత్ర పోషించాడని సమాచారం. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న f2- ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

బిగ్ బాస్ 2 లో విశాఖ పట్నం విశాలాక్షి స్కిట్ తో బుల్లితెర ప్రేక్షకుల్ని ఫన్ లో ముంచెత్తిన నూతన్ నాయుడు ఇప్పుడు f2 – ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మూవీతో మనందరికీ కావలసినంత ఫన్ అందించబోతున్నాడని తెలుస్తోంది. f2 దర్శకుడు అనిల్ రావిపూడి నూతన్ నాయుడికి పిలిచి మరీ అవకాశం ఇచ్చారని, పాత్ర నచ్చడంతో నటించడానికి నూతన్ నాయుడు ఓకే చెప్పాడని సినిమా వర్గాల భోగట్టా. ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోకుండానే నూతన్ నాయుడు ఈ సినిమాలో నటించాడని, ఫారిన్ లో షూట్ జరిగినా తన ఖర్చులు తానే పెట్టుకున్నాడని, భవిష్యత్తులో కూడా పాత్ర నచ్చితే పారితోషికం తో సంబంధం లేకుండా నటిస్తానని నూతన్ నాయుడు చెప్పాడని సమాచారం. సో ప్రేక్షకులతో పాటు ప్రొడ్యూసర్స్ కి కూడా ఇది గుడ్ న్యూసే.

భారీ బడ్జెట్ తో, భారీ తారాగణంతో, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వంటి సీనియర్స్ నటిస్తున్న f2 – ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ లో నటించడం సంతోషంగా ఉందని, డైరెక్టర్ అనిల్ రావిపూడి నుండి విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ వరకూ ఫిల్మ్ యూనిట్ అందరూ తనను ఎంతగానో ఆదరించారని, సిల్వర్ స్క్రీన్ కి తాను కొత్త అయినప్పటికీ ఎంతో ఎంకరేజ్ చేసారని నూతన్ నాయుడు సంతోషం వ్యక్తం చేసాడని కూడా సినీ వర్గాలు చెపుతున్నాయి. ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన దర్శకుడికి నూతన్ నాయుడు కృతజ్ఞతలు తెలియ జేశాడని టాక్.

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వస్తున్న f2 – ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఘన విజయం సాధించాలని, ఫిల్మ్ ఆరిస్ట్ గా నూతన్ నాయుడికి తొలి విజయం అందించాలని మనం కూడా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ నూతన్ నాయుడు.