ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ మూవీ కి టైటిల్స్ రెడీ?


ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ మూవీ కి టైటిల్స్ రెడీ?
ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ మూవీ కి టైటిల్స్ రెడీ?

‘కేజీఎఫ్’ సినిమాతో యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ . బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళని సాధించిన ఈ సినిమాకు  ప్రస్తుతం సీక్వెల్ గా ‘కేజీఎఫ్ 2’ ని రూపొందిస్తున్నారు.  20 శాతం చిత్రీకరణ మినహా షూటింగ్ మొత్తం పూర్తయినది.

డిజిటల్ రైట్స్ కూడా రికార్డ్ స్థాయి మొత్తానికి అమ్ముడు పోవడం, తొలి భాగం సంచలనం సృష్టించడం తో పార్ట్ 2 పై అంచనాలు ఏర్పడ్డాయి . ఇదిలా ఉంటే. ‘కేజీఎఫ్ 2’ తరువాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలుగులో భారి చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించడానికి ప్లాం చేస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్నారు. ఇప్పటికే మేకర్స్  డైరెక్టర్ కి 2 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఈ చిత్రానికి ‘రేడియేషన్’ అనే టైటిల్ ని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అయితేతాజా సమాచారం ప్రకారం నూక్లియర్, మిస్సైల్ అనే టైటిల్స్ ని చిత్ర బృందం మైత్రీ మూవీ మేకర్స్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించినట్టు తెలిసింది.