మణిశర్మ2.0 నుండి మరో మెలోడీ వచ్చేస్తోంది


Nuvve Nuvve from red to be out on march 6th
Nuvve Nuvve from red to be out on march 6th

దశాబ్దానికి పైగా టాప్ ఫామ్ లో కొనసాగిన మణిశర్మ టాలీవుడ్ లో టాప్ హీరోలు అందరికీ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోలకు మణిశర్మ సంగీతం చాలా సార్లు ప్లస్ గా మారింది. కేవలం సంగీతంతోనే కాకుండా మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంటే ఇప్పటికీ వారి ఫ్యాన్స్ చెవులు కోసుకుంటారు అంటే అతిశయోక్తి కాదు. అయితే కాలక్రమంలో మణిశర్మ తన ఫామ్ ను కోల్పోవడం, థమన్, దేవి శ్రీ ప్రసాద్ వంటి యువతరం దూసుకురావడంతో మణిశర్మకు అవకాశాలు సన్నగిల్లాయి.

అయితే గతేడాది వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం మణిశర్మ2.0ను అందరికీ పరిచయం చేసింది. ఆ సినిమాలో అటు మాస్ సాంగ్స్ కానీ ఇటు మెలోడీ కానీ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ కానీ ఇలా ఏ రకంగా చూసినా మణిశర్మ పూర్తి న్యాయం చేసాడు. ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ లో ఆడియో కీలక పాత్ర పోషించింది. చాలా కాలం తర్వాత వచ్చిన హిట్ కావడంతో రామ్ కూడా మణిశర్మ అంటే అభిమానం పెంచేసుకున్నాడు.

తన తర్వాతి చిత్రానికి కూడా మణిశర్మనే మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్న విషయం తెల్సిందే. రామ్ డ్యూయల్ రోల్ లో నటిస్తోన్న తాజా చిత్రం రెడ్. తమిళ హిట్ చిత్రం తడంకు ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్  జరుపుకుంటోంది. ఇటీవలే విడుదల చేసిన టీజర్ కు టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెల్సిందే. అందులో కూడా మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు విశేష స్పందన లభించింది.

తాజా సమాచారం ప్రకారం రెడ్ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ నువ్వే నువ్వే మెలోడియస్ ట్రాక్ ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. మెలోడీ బ్రహ్మగా పేరొందిన మణిశర్మ నుండి మరో మెలోడీ కావడంతో అందరూ చాలా ఉత్సాహంగా ఆ పాట కోసం ఎదురుచూస్తున్నారు. రెడ్ కు కిషోర్ తిరుమల దర్శకుడు.