“నువ్వు నేను ఈక్షణం” – రొమాంటిక్ మూవీ సాంగ్ రిలీజ్


Nuvvu Nenu E Kshanam video song from Romantic movie released
Nuvvu Nenu E Kshanam video song from Romantic movie released

పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరీ & కేతిక శర్మ హీరో,హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం రొమాంటిక్. ఈ సినిమాను పూరీ & చార్మీ స్వీయ నిర్మాణంలో ప్రొడ్యూస్ చేస్తుండగా, పూరీ శిష్యుడు అనిల్ పడూరీ డైరెక్షన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక హాట్ డ్యూయెట్ రిలీజ్ చేసారు. ఈ సాంగ్ విశేషం ఏంటంటే పెన్నుని గన్నులా వాడే మన గురూజీ స్వయంగా ఈ పాట లిరిక్స్ రాసారు. అది కూడా ప్రాసలతో లేకుండా, ఒక నేరేషన్ లాగా ఉంది ఈ పాట. సాంగ్ కి ముందు “”దేశాన్ని ప్రేమిస్తే రూపాయి ఖర్చు ఉండదు; కానీ అమ్మాయిని ప్రేమిస్తే మాత్రం సరదా తీరిపోద్ది” అంటూ తన ట్రేడ్ మార్క్ డైలాగ్ ఒకటి పేల్చి అప్పుడు పాటలోకి తీసుకెళ్ళారు పూరీ.

ఇక ప్రపంచాన్ని మర్చిపోయి, ప్రేమించుకునే ఇద్దరూ లవర్స్ గా ఆకాష్ & కేతిక శర్మ పోటీ పడ్డారు. ఇన్ని బీచ్ సాంగ్స్ చేసినా, పూరీ ప్రతి సినిమాలో ఉండే బీచ్ సాంగ్ కి కొత్త, కొత్త బ్లాక్స్ ఎలా క్రియేట్ చేస్తాడనేది ఇప్పటికీ మిలియన్ డాలర్ ప్రశ్న. ఇక సాంగ్ మొత్తం అర్ధం ఒక్క ముక్కలో చెప్పాలంటే “ఈ క్షణం మాత్రమే మన సొంతం. ప్రపంచం, సమాజం ఏమైనా అనవసరం. ఇప్పుడు ఈ క్షణం మనం సంతోషంగా ఉండాలనే” ఇద్దరు ప్రేమికుల డ్యూయెట్. విజయ్ దేవరకొండ తో తను చేసే “ఫైటర్” సినిమా వచ్చే లోపు ఈ సినిమాతో మనల్ని పూరీ సార్ ఎంగేజ్ చేసేలా ఉన్నాడు.