గట్టి కథ లా ఉందే.? – పిట్టకథ టీజర్ రిలీజ్


గట్టి కథ లా ఉందే.? – పిట్టకథ టీజర్ రిలీజ్
గట్టి కథ లా ఉందే.? – పిట్టకథ టీజర్ రిలీజ్

ఒక అమ్మాయి. ఇద్దరు ప్రేమికులు. ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించిందో తెలుసుకునే లోపు ఆ అమ్మాయి కిడ్నాప్.  ఇంతకీ ఆ తరువాత కథ ఏంటో.? అని అడిగితే పిట్ట కథ సినిమా చూడమని అంటున్నారు. .. పిట్ట కథ టీం.  విస్వాంత్, సంజయ్ రావు, నిత్య శెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకు చెందు ముద్దు దర్శకత్వం వహిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ పతాకం పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా టీజర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసారు. యూనిట్ కు బెస్ట్ విషెస్ అందించారు. ఒక స్వచ్చమైన పల్లెటూరు. అందులో ఒక అందమైన అమ్మాయి. పేరు వెంకటలక్ష్మి. ఇక టీజర్ చూస్తుంటే, విజువల్స్ ఎంతో రిచ్ గా, పర్ఫెక్ట్ గా ఉన్నాయి.ముఖ్యంగా హీరోయిన్ కళ్ళతోనే భావాలు పలికిస్తున్న తీరు అమోఘం. సస్పెన్స్ అంశాలు కరెక్ట్ గా సెట్ అయితే మరొక మంచి సినిమాను మనం ఆశించవచ్చు. ఇక ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు .