రాజమౌళి పేరు చెప్పి మహిళని మోసం చేసాడు


SS Rajamouli
SS Rajamouli

దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి నాకు చాలా సన్నిహితుడు అతడి సినిమాలో మీకు నటించే అవకాశం ఇప్పిస్తానంటూ ఓ మహిళ నుండి ఏకంగా 50 లక్షలు నొక్కేసాడు ఓ మోసగాడు . ఈ మోసగాడు కేవలం ఓ ఆఫీసు లో బాయ్ గా పనిచేస్తున్నాడు కానీ మోసం చేయడానికి మాత్రం ఏకంగా దర్శకులు రాజమౌళి పేరు వాడుకున్నాడు .

అవతలి వ్యక్తి చాలా పెద్దవాడు కావడంతో ఈ మోసగాడి చెబుతున్నది నిజమే అనుకుంది పాపం ……. అతడ్ని నమ్మి , సినిమా అంటే మోజు ఉండటంతో 73 ఏళ్ల వయసులో నటించాలనే ఉత్సాహంతో 50 లక్షల రూపాయలు ఇచ్చింది . పైగా ఈమె న్యాయవాది కావడం మరింత ఆశ్చర్యకరమైన విషయం . ఆర్ ఆర్ ఆర్ లో నటింపజేసే అవకాశం ఇస్తానని చెప్పి డబ్బు తీసుకొని ఫోన్ మార్చడంతో మోసపోయానని తెలుసుకున్న సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. మహిళా న్యాయవాది ని మోసం చేసిన నరేష్ ని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసారు .