ఆఫీసర్ రివ్యూ

officer reviewఆఫీసర్ రివ్యూ
నటీనటులు : నాగార్జున , అజయ్ , షాయాజీ షిండే
సంగీతం : రవిశంకర్
నిర్మాణం : ఆర్ కంపెనీ
దర్శకత్వం : రాంగోపాల్ వర్మ
రేటింగ్ : 2. 5/ 5
రిలీజ్ డేట్ : 1 జూన్ 2018

 

 

కింగ్ నాగార్జునరాంగోపాల్ వర్మ ల కాంబినేషన్ లో దాదాపు 25 ఏళ్ల తర్వాత రూపొందిన చిత్రం ” ఆఫీసర్ ” . గతకొంతకాలంగా రాంగోపాల్ వర్మ వరుస పరాజయాలు సాధిస్తుండటంతో ఆఫీసర్ పై పెద్దగా అంచనాలు లేకుండా పోయాయి . ఈరోజు విడుదలైన ఆఫీసర్ ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

పోలీస్ ఆఫీసర్ నారాయణ్ పసారి ముగ్గురు వ్యక్తులను ఎన్ కౌంటర్ లో చంపేయడంతో ముంబై హై కోర్టు అతడిపై విచారణ కు ఆదేశిస్తుంది . విచారణ కు హైదరాబాద్ కి చెందిన శివాజీరావు (నాగార్జున ) ని ఆఫీసర్ గా నియమిస్తుంది . దాంతో హైదరాబాద్ నుడి ముంబై కి వెళ్తాడు . అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సమయంలో పోలీస్ అధికారి నారాయణ్ పసారి అసలు హంతకుడు అని తెలుస్తుంది దాంతో అతడ్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడతాడు అయితే సరైన సాక్ష్యాధారాలు చూపించకపోవడంతో నారాయణ్ పసారి ని నిర్దోషిగా విడుదల చేస్తారు . తనని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచిన శివాజీరావు పై కక్ష్య పెంచుకుంటాడు నారాయణ్ పసారి . అవినీతి పోలీస్ ఆఫీసర్ కు నిజాయితీ పరుడైన ఆఫీసర్ కు మధ్య సాగిన పోరులో శివాజీరావు ఎలా విజయం సాధించాడన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

నాగార్జున

డ్రా బ్యాక్స్ :

స్క్రీన్ ప్లే
ప్రొడక్షన్ వేల్యూస్
హింస

నటీనటుల ప్రతిభ :

అక్కినేని నాగార్జున ఆఫీసర్ పాత్రలో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు . రియలిస్టిక్ అప్రోచ్ తో నాగ్ సరికొత్తగా కనిపించాడు . నాగార్జున కు ఈ ఆఫీసర్ ఖచ్చితంగా విభిన్నమైన పాత్రే ! ఇక నాగ్ కూతురు గా నటించిన బేబీ కావ్య బాగా నటించింది . అజయ్ , షాయాజీ షిండే తో పాటుగా మిగతా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు .

సాంకేతిక వర్గం :

ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వర్మ కానీ ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో పూర్తిగా విఫలం అయ్యాడు మరోసారి . స్క్రీన్ ప్లే , డైలాగ్స్ ఏవి కూడా అంతగా ఆకట్టుకునేలా లేవు , మొత్తంగా దర్శకుడిగా మరోసారి విఫలమయ్యాడు రాంగోపాల్ వర్మ . రవి శంకర్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది , అలాగే ఛాయాగ్రహణం కూడా కానీ సినిమా మేకింగ్ మరీ పూర్ అనే చెప్పాలి . నిర్మాణ విలువలు పాటించలేదు .

ఓవరాల్ గా :

ఆఫీసర్ ఆకట్టుకునే చిత్రం కాదు

                  Click here for English Review