పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి భయపడిన ఆఫీసర్


officer unit afraid of pawan kalyan fans

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడ ఆఫీసర్ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ పై దాడి చేస్తారేమో నని భయపడి ఆఫీసర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని నాగార్జున కు చెందిన ” ఎన్ కన్వేషన్స్ సెంటర్ ” లో నిర్వహించారు . పవన్ కళ్యాణ్ పై గతకొంత కాలంగా రాంగోపాల్ వర్మ ట్వీట్ ల దాడి చేస్తున్న విషయం తెలిసిందే . శ్రీ రెడ్డి ని కూడా పవన్ కళ్యాణ్ మీదకు ఉసిగొల్పింది రాంగోపాల్ వర్మ అనే విషయం బయటికి పొక్కిన విషయం తెలిసిందే . అప్పటి నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రాంగోపాల్ వర్మ మీద రగిలిపోతున్నారు .

ఎక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాడి చేస్తారేమోనని భయపడిన వర్మ వందలాది మంది బౌన్సర్ లను తనకు రక్షణగా పెట్టుకున్నాడు . నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో ఆఫీసర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు . కాగా ఆవేడుకలో అభిమానుల కంటే బౌన్సర్ లు అలాగే పోలీసులు ఉండటం విశేషం . ఆఫీసర్ ఈవెంట్ ని అసలు బయట ఇతర చోట్ల చేద్దామనుకున్నారు కానీ వాళ్లకు స్టార్ హోటళ్ల ని ఇవ్వడానికి కానీ ఇతర ఫంక్షన్ హాళ్ల ని ఇవ్వడానికి కానీ నిరాకరించారు ఎందుకంటే ఆ సమయంలో పవన్ ఫ్యాన్స్ దాడి చేస్తే ఇబ్బంది అని భయపడ్డారు . ఫంక్షన్ హాళ్లు ఎవరూ ఇవ్వకపోవడంతో చేసేది లేక నాగ్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ వేడుక నిర్వహించారు వందలాది మంది బౌన్సర్ ల సమక్షంలో .