ఆఫీసర్ ఓవర్ సీస్ ఫస్ట్ డే కలెక్షన్లు


Officer USA box office Collection

అక్కినేని నాగార్జున నటించిన ఆఫీసర్ చిత్రం ఘోర పరాజయం పొందింది . సినిమాపై ముందే అంచనాలు లేకుండా పోయాయి దాంతో ఓవర్ సీస్ లో ఓపెనింగ్స్ లేకుండా పోయాయి . ఓవర్ సీస్ లో ఈ సినిమా పట్ల అంతగా సుముఖంగా లేకపోవడంతో కేవలం 54 లొకేషన్ల లో మాత్రమే విడుదల అయ్యింది . ఇక ప్రీమియర్ షోల తో వచ్చిన మొత్తం ఎంతో తెలుసా …… $27, 176 డాలర్లు అంటే భారత కరెన్సీ లో 18 లక్షల పైచిలుకు అన్నమాట .

అక్కినేని నాగార్జున స్టార్ హీరో అయినప్పటికీ ఇంతటి దారుణమైన వసూళ్ల ని సాధించడానికి కారణం రాంగోపాల్ వర్మ చెత్త రికార్డ్ మాత్రమే ! గతకొంత కాలంగా వర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రాలన్నీ దారుణంగా దెబ్బ తింటున్నాయి దాంతో ఆఫీసర్ చిత్రాన్ని ఓవర్ సీస్ జనాలు పెద్దగా పట్టించుకోలేదు . అయితే నాగార్జున హీరోగా నటించిన సినిమా కాబట్టి ఈ మాత్రమైనా కలెక్షన్లు ఉన్నాయి . ప్రీమియర్ షోలతోనే దిమ్మతిరిగి పోయింది దాంతో చాలా చోట్ల ఎత్తేసారు ఆఫీసర్ చిత్రాన్ని . నాగార్జున కెరీర్ లోనే అత్యంత చెత్త రికార్డ్ ఈ సినిమా కు దక్కింది .