అఫీషియ‌ల్‌‌: ప‌వ‌న్‌తో పోటీకి భ‌ల్లాలుడొచ్చేశాడు!

అఫీషియ‌ల్‌‌: ప‌వ‌న్‌తో పోటీకి భ‌ల్లాలుడొచ్చేశాడు!
అఫీషియ‌ల్‌‌: ప‌వ‌న్‌తో పోటీకి భ‌ల్లాలుడొచ్చేశాడు!

టాలీవుడ్ స్టార్ హీరో ప‌వర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ జోరు పెంచారు. దాదాపు రెండున్న‌రేళ్ల విరామం త‌ర‌వాత ఆయ‌న మ‌ళ్లీ వెండితెర‌పై మ్యాజిక్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్ర `వ‌కీల్‌సాబ్‌`. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా వేణు శ్రీ‌రామ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. బోనీక‌పూర్‌తో క‌లిసి దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఈ మూవీతో పాటు ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌రో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌ని లైన్‌లో పెట్టారు.

క్రిష్ ద‌ర్శ‌కత్వంలో ఓ పాన్ ఇండియా స్థాయి చిత్రాన్ని చేస్తున్న ప‌వ‌న్‌కల్యాణ్ `గ‌బ్బ‌ర్‌సింగ్ ` ఫేమ్ హ‌రీష్‌శంక‌ర్‌తోనూ ఓ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లో క్రిష్ చిత్రం కొంత మేర చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. త్వ‌ర‌లోనే పునః ప్రారంభం కాబోతోంది. ఇదిలా వుంటే ఈ మూవీల‌తో పాటు తాజాగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌రో చిత్రాన్ని అంగీక‌రించారు. మల‌యాళ హిట్ ఫిల్మ్ అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా ఈ మూవీ రూపొంద‌నుంది.

ఇందులో ప‌వ‌న్‌తో పాటు మ‌రో హీరో రానా ద‌గ్గుబాటి కూడా న‌టించ‌బోతున్నారు. ఇదే విష‌యాన్ని చిత్ర బృందం సోమ‌వారం ఉద‌యం ప్ర‌క‌టించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోని కూడా పోస్ట్ చేసింది. దీంతో ప‌వ‌న్‌తో ఈ మూవీలో భ‌ల్లాల‌దేవ పోటీప‌డ‌బోతున్నాడ‌ని క్లారిటీ వ‌చ్చేసింది. మ‌ల‌యాళ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌, బీజు మీన‌న్ పోటీప‌డి న‌టించారు. తెలుగులో ఆ పాత్ర‌ల్లో ప‌వ‌న్‌, రానా పోటీప‌డ‌బోతున్నారు. ఈ మూవీ ఈ రోజే లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించ‌నున్నారు.