బ్రేకింగ్‌:  రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్‌ల‌తో దిల్‌రాజు చిత్రం!

బ్రేకింగ్‌:  రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్‌ల‌తో దిల్‌రాజు చిత్రం!
బ్రేకింగ్‌:  రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్‌ల‌తో దిల్‌రాజు చిత్రం!

శుక్ర‌వారం సాయంత్రం బిగ్ బ్రేకింగ్ అవ్వ‌బోతున్నామని ప్ర‌క‌టించి అన్న‌ట్టుగానే బ్రేకింగ్ న్యూస్‌ని అందించారు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అధినేత‌లు దిల్ రాజు, శిరీష్‌. దిగ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ‌మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా భారీ పాన్ ఇండియా మూవీ ని నిర్మించ‌బోతున్నారంటూ గ‌త రెండు రోజులుగా వార్త‌లు షికారు చేస్తున్న విష‌యం తెలిసిందే.

తాజాగా శుక్ర‌వారం సాయంత్రం దిల్‌రాజు, శిరీష్ బిగ్ బ్రేకింగ్ న్యూస్‌ని అనౌన్స్ చేశారు. శంక‌ర్ – రామ్‌చ‌ర‌ణ్‌ల కాంబినేష‌న్‌లో త‌న సంస్థ నిర్మించ‌నున్న 50వ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌బోతున్నామ‌ని, మునుపెన్న‌డూ చూడ‌ని స్థాయిలో ఈ మూవీ వుంటుంద‌ని వెల్ల‌డించారు. ఇది రామ్‌చ‌ర‌ణ్ న‌టించ‌నున్న 15వ చిత్రం. ద‌క్షిణాది సినిమాల స్థాయిని, స‌బ్జెక్ట్ ప‌రంగా, సాంకేతికంగా ఉన్న‌తంగా వుండేలా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లిన ద‌ర్శ‌కుడు శంక‌ర్ అలాంటి ద‌ర్శ‌కుడితో ఈ భారీ చిత్రాన్నినిర్మించ‌బోతున్నాం` అన్నారు.

శంక‌ర్‌, చ‌ర‌ణ్‌ల కాంబినేష‌న్‌లో పాన్ ఇండియా మూవీ అంటే అంచ‌నాలు ఏ స్థాయిలో వుంటాయో ఊహించుకోవ‌చ్చు. ప్రేక్ష‌కులు ఎంజాయ్ చేసే స్థాయిలో ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురానున్నాం. ఈ చిత్రంలో న‌టించే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివారాల్ని త్వ‌ర‌లో తెలియ‌జేస్తాం` అన్నారు దిల్ రాజు, శిరీష్‌.