సైఫ్ అలీ ఖాన్ సెన్సేషన్ – “జవానీ జానేమన్” ట్రైలర్


Jawaani Jaaneman trailer released
Jawaani Jaaneman trailer released

బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కి కొంత కాలంగా సరైన సినిమాలు పడలేదు. మొదట కెరియర్ లో నిలదొక్కుకోడానికి కూడా మనోడికి ఎక్కువ కాలమే పట్టింది .షారుఖ్ తో స్నేహం తరువాత సైఫ్ బాలీవుడ్ లో రిజిస్టర్ అయ్యాడు. అలా అనీ… సైఫ్ కి ఉన్న ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మామూలుది కాదు. ఆయన తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఒక గొప్ప క్రికెటర్. అదేవిధంగా తల్లి షర్మిలా టాగూర్ గారు ఫేమస్ హీరోయిన్.

తర్వాత కాలంలో హీరోయిన్ కరీనా కపూర్ తో ప్రేమాయణం, పెళ్లి తరువాత సైఫ్ సినిమాలు చేసాడు కానీ, ఏది ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. కానీ బాలీవుడ్ లో లుక్ పరంగా ఆయనకి అభిమానులు ఎక్కువే. ఆయన చేసిన రేస్ , రేస్ 2 సినిమాలు ఒక సెన్సేషన్. సినిమాలు చేసుకుంటూనే వ్యాపార రంగం లో రాణిస్తూ బాలీవుడ్ నవాబ్ గా సైఫ్ పేరు తెచ్చుకున్నాడు.

ఇప్పుడు సైఫ్ మళ్ళీ తను తాను కొత్తగా రీడిఫైన్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అందులో భాగంగా అజయ్ దేవగన్ తీసిన భారీ చిత్రం “తానాజీ” లో కొండానా కోట కిలేదార్ “ఉదయ్ భాన్ సింగ్ రాథోడ్” అనే ప్రతినాయక ఛాయలున్న పాత్రలో నటించాడు. ఇప్పుడు సైఫ్ తనకు బాగా పేరు తెచ్చిన రొమాంటిక్ కామెడీ జోనర్ లో “జవానీ జానేమన్” అనే సినిమా చేసాడు. టబు హీరోయిన్. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూసి ఫ్యాన్స్ “నవాబ్ వాపస్ ఆగయా” అంటున్నారు.

ఈ ట్రైలర్ లో భాగంగా 45 ఏళ్ళు వచ్చినా హీరో ఇంకా ప్లే బాయ్ లాగా తిరుగుతూ ఉంటాడు. తనకు ఎందుకు పెళ్లి కావడం లేదు.? అనే విషయం పై కామెడీ చూపించాక, సడన్ గా ఒక అమ్మాయి వచ్చి, “నేను నీ కూతురుని” అంటుంది. హీరోకి అసలు అర్ధం కాదు. ఆ పిల్లను బయట తన కూతురుగా చెప్పుకోలేక సతమతం అవుతూ ఉంటే పిల్ల తల్లి కూడా ఎంట్రీ ఇస్తుంది. కథలో భాగంగా నవ్విస్తూనే ఎమోషనల్ సన్నివేశాలు కూడా ఉన్నట్లు చూపించారు. ఇక సైఫ్ అన్ని రకాలుగా మళ్ళీ “లవ్ ఆజ్ కల్” నాటి సైఫ్ ని గుర్తు తెచ్చే ప్రయత్నం చేసాడు. ఈ సినిమా 31st జనవరి రిలీజ్ కానుంది.