అసురన్ టీం మరొక సంచలనం “సంగ తలైవన్”


అసురన్ టీం మరొక సంచలనం “సంగ తలైవన్”
అసురన్ టీం మరొక సంచలనం “సంగ తలైవన్”

సముద్రఖని అంటే చాలా మందికి ధనుష్ సినిమా VIP లో హీరో తండ్రి క్యారెక్టర్ చేసిన నటుడు అని అనుకుంటారు. కానీ ఆయన కూడా ఒక గొప్ప దర్శకుడు. మొదట నటి రాధిక చేసిన పలు సీరియల్స్ కి దర్శకత్వం వహించిన ఆయన “నాడోడిగల్” (తెలుగులో శంభో శివ శంభో ) సినిమా నిజంగానే ఒక సంచలనం. ఇప్పుడు ఆయన డైరెక్టర్ వెట్రిమారన్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచెయ్యడం తోపాటు ఉదయంNH4, పూరియాలన్, సినిమాలకు డైరెక్షన్ చేసిన మణిమారన్ కొత్త సినిమా అయిన “సంగతలైవన్” సినిమాలో హీరో గా చేస్తున్నారు. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

ఒక్కమాటలో ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రచయిత దాశరధి చెప్పినట్లు… “శ్రమజీవుల పచ్చి నెత్తురు తాగే ధనవంతులు ఎందరో…” అనే పాట లిరిక్ తగ్గట్టుగా ఈ సినిమా ఉంది. తమ శ్రమకు తగిన గుర్తింపు తగిన ఫలితం ఇవ్వమని కోరుకుంటుంది శ్రామికవర్గం. “మీరు కేవలం శ్రమ మాత్రమే చేశారు… పెట్టుబడి తోపాటు వచ్చే రాబడి, లాభం లో అయినా మెజారిటీ మాకే దక్కాలి అంటుంది.!” పెత్తందారీ వర్గం. దేశాలకు, ఖండాలకు, ప్రాంతాలకు అతీతంగా అన్ని భాషలలో కూడా పనిచేసి ఫలితం కోసం ఆశగా ఎదురుచూసే.. ఒక కూలీ వాడి ఆకలి చూపు ఒక్కటిగానే ఉంటుంది.

అదే కూలివాడు ఎదురుతిరిగితే ఎంతటి సామ్రాజ్యం అయిన కూలి పోవాల్సిందే. ఇప్పుడు “సంగతలైవన్” సినిమా లో అదే చూపిస్తున్నారు. తమిళనాడులో ఉన్న వస్త్రాలు మరియు దారాల పరిశ్రమ వెనక జరిగే అవినీతి, కుంభకోణాలు అక్కడ లేబర్ కి జరిగే అన్యాయాలు ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా వస్తోంది. “గతంలో అన్యాయాలను ఎదిరించే వాళ్లని ఉద్యమకారులు పోరాట యోధులు అనేవాళ్ళు… కానీ ఇప్పుడు అలాగే చేస్తే మాత్రం దేశద్రోహి, తీవ్రవాది అని ముద్ర వేసి కాల్చి చంపేస్తా…!” అని పోలీస్ ఆఫీసర్ హీరో ని బెదిరించే సీన్ ట్రైలర్ కే హైలెట్. ఈ సినిమాకు వెట్రిమారన్ కూడా ఒకానొక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇంతమంది కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం మరొక “అసురన్” సినిమా లెవల్ లో ఉంటుందని మూవీ లవర్స్ అంచనాలు వేస్తున్నారు.