19 ఇయర్స్ తరువాత కలిసిన కమల్-రెహమాన్!!


ofter 19 years back meet to kamal ar rehaman
ofter 19 years back meet to kamal ar rehaman

కమల్‌ హాసన్‌, ఏ.ఆర్‌ రెహమాన్‌.. ఇద్దరూ సినీ రంగ దిగ్గజాలే. వీళ్లిద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకరు నటన పరంగా, మరొకరు సంగీతం పరంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇద్దరు పద్మ శ్రీ గ్రహీతలే. కమల్‌ నటించిన ‘భారతీయుడు’, ‘తెనాలి’ చిత్రాలకు రెహమాన్‌ సంగీతం అందించారు. దాదాపు 19 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. కమల్‌ నటిస్తున్న ‘తలైవన్‌ ఇరుక్కిండ్రాన్‌’ చిత్రానికి రెహమాన్‌ సంగీతం అందించనున్నారు. ఈ విషయాన్ని కమల్‌హాసన్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. అందులో ఆయన ఈ విధంగా స్పందించారు.

‘నీ భాగస్వామ్యంతో చిత్రబృందానికి మరింత బలాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు రెహమాన్‌. మనం స్క్రిప్ట్‌ను ఎంత డెవలప్‌ చేసినా కొన్ని సినిమాలు మాత్రమే సరైన సంతృప్తినిస్తాయి. వాటిలో ‘తలైవన్‌ ఇరుక్కిండ్రాన్‌’ ఒకటి. ఈ సినిమా కోసం మీరు చూపుతున్న ఎగ్జైట్‌మెంట్‌ను మిగిలిన చిత్ర బృందానికి కూడా పంచుతాను’ అని పేర్కొన్నారు. ‘తలైవన్‌ ఇరుక్కిండ్రాన్‌’ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోంది. చాలా ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. రెహమాన్‌ రాకతో మళ్లీ చిత్రీకరణను ప్రారంభించారు. లైకా ప్రొడక్షన్స్‌, రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరిన్ని వివరాలు అతి త్వరలో తెలుస్తాయి!!