ఓ బేబీ పార్ట్ 2 కూడా తీస్తారా ?


 Oh Baby Movie
Oh Baby Movie Poster

సమంత నటించిన ఓ బేబీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది . జూలై 5న విడుదలైన ఓ బేబీ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు . కొరియన్ సినిమా అయినప్పటికీ తెలుగు వాళ్లకు నచ్చేలా తీర్చిదిద్దారు దర్శకురాలు  నందిని రెడ్డి . ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో నాగచైతన్య కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండాపోయాయి .

అయితే నాగచైతన్య క్లైమాక్స్ లో కంపించడంతో ఓ బేబీ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా ? అన్న చర్చ సాగుతోంది . హృదయాలకు హత్థకునేలా ఉన్న ఈ సినిమాలో చైతూ సెప్షల్ ఎట్రాక్షన్ అనే చెప్పాలి . ఇక సినిమా కూడా పెద్ద హిట్ కావడంతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి .అయితే ఇప్పుడు ఓ బేబీ చిత్ర బృందం దృష్టి అంతా విజయాన్ని ఎంజాయ్ చేయడంలో ఉన్నారు . ఆ తర్వాత సీక్వెల్ ఆలోచన చేస్తారేమో !