ఓ బేబీ థాంక్స్ మీట్


OH Baby Thanks Meet
OH Baby Thanks Meet

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, క్రాస్ పిక్చ‌ర్స్ ప‌తాకాల‌పై స‌మంత అక్కినేని, ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, రావు ర‌మేష్‌, రాజేంద్ర‌ప్ర‌సాద్ ప్ర‌ధాన తారాగ‌ణంగా బి.వి.నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కినచిత్రం ` ఓ బేబీ`. సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్ నిర్మాత‌లు.  జూలై 5 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మ్యాజికల్ బ్లాక్ బస్టర్ గా అటు ప్రేక్షకుల, ఇటు సినీ వర్గాల ప్రముఖుల ప్రశంసలు పొందుతూ రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సందర్భంగా  చిత్ర యూనిట్  ఆదివారం (జూలై 7 )న రామానాయుడు స్టూడియోలో థాంక్స్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హీరో రానా దగ్గుపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈసందర్భంగా

ఇంద్ర ఫేమ్ నటుడు తేజ మాట్లాడుతూ – సురేష్‌బాబుగారు కొత్త‌వాళ్ల‌కు చాలా స‌పోర్ట్ చేస్తారు. నాకు  కూడా ఆయ‌న చాలా స‌పోర్ట్ చేశారు. ఇంత మంచి సినిమాలో నటించే  అవకాశం ఇచ్చిన నందినిగారికి చాలా థాంక్స్. ఈ సినిమా ఆఫ‌ర్ నాకు పెద్ద గిఫ్ట్. స‌మంత గారిది గోల్డెన్ హ్యాండ్. . ప్ర‌తి షాట్‌లో ఆమె అద్భుతమైన నటన కనబరిచారు. ఈ సినిమా నా కెరీర్ లో ఒక గుర్తుండి పోయే సినిమా అవుతుంది. `  అన్నారు.

నిర్మాత సునీత తాటి మాట్లాడుతూ.. మేమందరం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రెట్టింపు  రెస్పాన్స్ వస్తోంది.. ఈ సినిమాతో సమంత నిర్మాతలను సేవ్ చేస్తూ అక్రాస్ ది వరల్డ్ గొప్ప స్టార్ అవుతుందని ఒక నిర్మాత నమ్మకంగా చెప్పగలను. రివ్యూస్ చూసి చైనా నుంచి కాల్స్ వచ్చాయి చైనా లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం, దీన్ని బట్టించి అర్థం అవుతుంది సమంత పవర్ ఏంటో” అన్నారు.

పీపుల్ మీడియా వివేక్ మాట్లాడుతూ –  మంచి సినిమాలను ఆదరిస్తున్న  ప్రేక్షకులకు థాంక్స్. ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అందుకే ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తున్నారు. ఇంత గొప్ప సినిమాలో నటించిన సమంత గారికి, దర్శకురాలు నందిని రెడ్డి కి అభినందనలు’ అన్నారు.

రైటర్ లక్ష్మి భూపాల్ మాట్లాడుతూ  –  ” సురేష్ బాబు గారు సినిమా బాగా వచ్చేవరకు సాన బెట్టారు.   ఆయన అలా  ఉండటం వల్లనేమో అన్ని  సినిమాలు సక్సెస్ లు అవుతున్నాయి. నందిని రెడ్డి తో వర్క్ చేయడం చాలా కంఫర్ట్ ఉంటుంది. జీవితంలో ఎంతో మంది బంధువులు ఉన్నా ఏదో ఒక లోటు అనేది ఉండేది. ఆ లోటుని తీర్చడానికి దేవుడు పంపిన సోల్  నందిని రెడ్డి. ఈ సినిమా మా అందరి   సమిష్టి కృషి. కొన్ని సినిమాలు కొంత మంది జీవితాలను మార్చేలా చేస్తాయి. అలా ఈ సినిమా వలన ఒక రియల్ ఇన్సిడెంట్ నాకు ఒకతని ద్వారా మెసేజ్ వచ్చింది. నిజంగా ఇది అద్భుతం. మొదట  ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఆ తరువాతే మిగతావేమైనా… అలాంటి మాటలు చెప్పడానికి నా మాటలు  ఉపయోగపడినందుకు గర్వంగా ఉంది. ఈ సినిమాలో డైలాగ్స్  కూడా ప్రశంసలు వస్తున్నాయి. అందుకు కారణం కథ, నందిని రెడ్డి.  ఈ సినిమాలో  నటించిన ప్రతి ఒక్క ఆర్టిస్టు ఎంతో   కష్టపడ్డారు కనుకే ఇంత గొప్ప విజయం అందింది. సీనియర్ యాక్టర్  లక్ష్మి గారికి నేను రాసిన డైలాగ్స్ ను సమంత గారు లక్ష్మి గారిలోనికి పరకాయ ప్రవేశం చేసి ప్రాణం పోశారు” అన్నారు.

చిత్ర దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ – ” సినిమా అయ్యాక థియేటర్ కి  విజిట్ కు వెళితే అక్కడ ఒక్కొక్కరు హగ్ చేసుకొని మరీ మా అమ్మ, మా నాన్నమ్మ కనిపించిందంటూ, ఎంత గొప్ప సినిమా చేసారంటూ ప్రశంసిస్తున్నారు.. హార్ట్ టచ్చింగ్ గా అనిపించింది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు వస్తుందో లేదో నా లైఫ్ లో అనిపించింది. ఇలాంటి మంచి ఎక్స్పీరియన్స్ లు  చాలా అరుదుగా వస్తుంటాయి. అది నాకు దక్కినందుకు హ్యాపీ గా ఉంది. ఈ సినిమా నా జన్మకు గ్రేటెస్ట్ మెమరీ. ఇంతకంటే మాట్లాడడానికి మాటలు లేకుండా చేశారు ఆడియన్స్.  నా కళ్ళు చెమర్చే అనుభూతిని పొందాను. ఈ కథను ఇండియాకు తీసుకొచ్చిన థామస్ గారికి నా స్పెషల్ థాంక్స్.  సునీతను, సమంతను  నన్ను ఏదో డెస్టినీ కలిపింది. నా టీమ్ నా బలం.  అందరూ కనెక్ట్ అయ్యి ఈ సినిమా  చేశారు.. సురేష్ గారు చెప్పిన ప్రతి మాట ఇప్పుడు  ఇంత సక్సెస్ కు కారణం” అన్నారు.

హీరోయిన్ సమంత అక్కినేని  మాట్లాడుతూ..  ఈ సినిమా షూటింగ్ లో కంటే ప్రమోషన్లోనే ఎక్కువ పాల్గొన్నా ను .. ఈ సినిమాకు నాకు  సపోర్ట్ చేసిన వారందరికీ, ఆడియోన్స్ కు  థాంక్స్. మీరు ఇచ్చిన   బెస్ట్ గిఫ్ట్ ఇది. సినిమా చేసేటప్పుడు చాలా కష్టపడ్డాను ఆ కష్టం ఫలితంగా  అనుకున్న దానికంటే బెస్ట్ రిజల్ట్ వచ్చింది.  ఇంతకంటే బెస్ట్ స్క్రిప్ట్ లతో బెటర్ పెర్ఫామెన్స్ లతో  మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ సినిమాకు వచ్చిన ప్రతి పాజిటివ్ ట్వీట్ నా హార్ట్ కు టచ్ అయ్యింది. అందుకు పర్సనల్ గా.. ఓ బేబీ టీమ్ కు అలానే ఆడియన్స్ కు  ప్రతి ఒక్కరికీ నా స్పెషల్ థాంక్స్ ” అన్నారు.

హీరో రానా దగ్గుపాటి  మాట్లాడుతూ… ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో నేను ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.. నేను అప్పుడప్పుడు కలెక్షన్స్ కోసం డిస్ట్రిబ్యూటర్స్ కు ఫోన్ చేసి అడుగుతుంటాను.. అలానే ఈ సినిమా గురుంచి అడిగినప్పుడు  మీ సినిమా కంటే బాగా ఆడేస్తోంది అని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. సమంతకు మంచి సినిమాల్లో నటించాలనే  నీ పిచ్చికి అడ్రస్ దొరికింది.  సురేష్ ప్రొడక్షన్స్  బ్యానర్ లో నువ్వు ఎన్ని సినిమాలైనా హ్యాపీగా  చేసుకోవచ్చు. ఇక సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం  వరల్డ్ ఉమెన్స్ ట్రెండ్ అనిచెప్పొచ్చు..అది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము. విమెన్ ఎమోషన్స్… మెన్స్ హార్ట్ ను టచ్ చేశాయి. ఇలాంటి ఒక స్పెషల్  మూవీని తెలుగు  ఆడియన్స్ ఆదరిస్తున్నకు థాంక్స్. ఒక కొరియన్ కథను రాసి, అడాప్ట్ చేసి, డైరెక్ట్ చేసిన నందినికి హ్యాట్స్ ఆఫ్ అండ్ కంగ్రాట్స్. ఇలాంటి కొత్త సినిమాలు రావాలంటే చాలా కష్టం. వస్తే అవాంతరాలు ఉంటాయి. కానీ ఇలాంటి సినిమాలే మెయిన్ సినిమాలయ్యి  ముందు నిలబడి విజయం సాధించాయి అందుకు అందరికీ నా బెస్ట్ విషెస్” అన్నారు.