తమన్నా విషయంలో అన్నాతమ్ముడు వేరువేరుగా చెప్పారే!


తమన్నా విషయంలో అన్నాతమ్ముడు వేరువేరుగా చెప్పారే!
తమన్నా విషయంలో అన్నాతమ్ముడు వేరువేరుగా చెప్పారే!

రాజు గారి గది సిరీస్ లో మూడో భాగం రేపు విడుదలకు సిద్ధంగా ఉంది. ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా అవికా గోర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన రాజు గారి గది 3 చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే మొదట అవికా గోర్ బదులు తమన్నాను అనుకున్నారు. సినిమా ప్రారంభోత్సవంలో కూడా తమన్నా పాల్గొంది. అయితే కారణాలు తెలియదు కానీ ఆమె సినిమా నుండి తప్పుకుంది. పెద్దగా టైం వేస్ట్ చేయకుండా ఓంకార్ అవికా గోర్ ను తీసుకుని చకచకా షూటింగ్ పూర్తి చేసాడు.

ఇటీవలే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అశ్విన్ తమన్నా విషయంలో స్పందిస్తూ కేవలం డేట్స్ ప్రాబ్లెమ్ రావడం వల్లే ఈ చిత్రం నుండి తమన్నా తప్పుకుందని చెప్పాడు. అయితే అశ్విన్ ఇలా చెప్పిన విషయంపై అన్న, దర్శకుడు ఓంకార్ కు క్లారిటీ లేదనుకుంటా. అతను టోటల్ గా డిఫరెంట్ వెర్షన్ ను చెప్పుకొచ్చాడు.

నిజానికి మొదట తమన్నాకు లైన్ మాత్రమే వినిపించాం. ఆమెకు అది నచ్చడంతో తమన్నా పేరు అనౌన్స్ చేసేసాం. తీరా ఫుల్ నరేషన్ ఇచ్చాక తమన్నా తన పాత్రను మార్చాలని కొన్ని సూచనలు చేసింది. దాని వల్ల కథ కూడా మారిపోతుంది. సినిమాను మొదలుపెట్టడానికి చాలా తక్కువ సమయమే ఉండడంతో కథను మార్చడం కుదర్లేదు. అందుకే తమన్నాను వద్దనుకున్నాం. ఆమె స్థానంలో తాప్సి, కాజల్ లాంటి వాళ్ళను అనుకున్నా వాళ్ళు బిజీగా ఉండడంతో అవికాను తీసుకున్నాం. అవికా తన పాత్రకు వంద శాతం న్యాయం చేసింది అన్నాడు ఓంకార్.