పెద్ద నటి, చిన్న తప్పు


Bhanupriya
పెద్ద నటి, చిన్న తప్పు

డెబ్భై, ఎనభైల కాలంలో పుట్టిన వారికి తమకి ఇష్టమైన నటి ఎవరు అని అడిగితే ఎక్కువ మందికి నటి “భానుప్రియ” గారి పేరు చెప్తారు. చేసిన సినిమాలు, సినిమాలలోని పాత్రలు, పాత్రలు అంటే చిలిపి, అలక, అభినయం, నృత్యం, హాస్యం, భయానకం ఇలా ఏ పాత్ర ఇచ్చిన చేసేంత సమర్ధురాలు.

మరి భానుప్రియ గారు ఇప్పుడు చేసిన తప్పు ఏంటి అంటారా? అది చిన్న తప్పు అని అనాలా, లేక ఆమె మీద వస్తున్న పుకార్లు అని కొట్టేయాల అని అర్ధం కానీ పరిస్థితి. భానుప్రియా గారే వాటికి సమాధానం చెప్పాలి. ఇంతకీ చేసిన తప్పు ఏంటి అంటారా?

చెన్నైలోని ఒక ఇంట్లో నివసిస్తున్న భానుప్రియ గారు ఇంటి పనుల కోసం, అలాగే ఇతరత్రా అవసరాల కోసం ఒక మైనర్ (వయస్సు తక్కువ) బాలికను నియమించుకున్నారు అని ఆరోపణ కొంత కాలంగా వినిపిస్తున్నదే. అయితే తన ఇంట్లో పని పిల్ల చోరీకి పాల్పడిందంటూ 2018 జనవరి 19న చెన్నైలోని పాండిబజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారు.

అప్పటికే పని పిల్ల తల్లి ప్రభావతి ఏపీలోని సామర్లకోటలో భానుప్రియ మీద ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను ఇంట్లో పనులకి వాడుకుంటున్నారు, చిత్రహింస కి గురి చేస్తున్నారని, దీంతో రంగంలోకి దిగిన సామర్లకోట పోలీసులు చెన్నైకి వచ్చి భానుప్రియను విచారించారు.

అప్పుడే అదే సమయంలో భానుప్రియ గారు పెట్టిన కేసులో పనిపిల్ల తల్లి ప్రభావతిని అరెస్ట్ చేసి విచారించారు. ఇదిలా ఉండగా నేరం (దొంగతనం + మరియు భానుప్రియ మీద అభియోగం) జరగటంతో సామర్లకోట నుంచి కేసు చెన్నైకి తరలించారు. మరోవైపు భానుప్రియపై బాలకార్మికుల చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో భానుప్రియను ఏ తరుణంలో అయినా అరెస్ట్ మరియు మరొకసారి విచారించే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.

అంత పెద్ద నటి అయ్యివుండి ఇంట్లో పనికి పెట్టుకునేటప్పుడు, పని వారి వయసు విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న చిన్న విషయాన్ని భానుప్రియ ఎలా మిస్ అయినట్లు? అని తెలుగు, తమిళ వాళ్ళు అయిన భానుప్రియ సన్నిహితులు అబ్బురపడిపోతున్నారు.