ఎగిరే పావురమా నటి ‘లైలా’ మళ్ళీ తెరమీదకి రాబోతున్నారు


ఎగిరే పావురమా నటి 'లైలా' మళ్ళీ తెరమీదకి రాబోతున్నారు
ఎగిరే పావురమా నటి ‘లైలా’ మళ్ళీ తెరమీదకి రాబోతున్నారు

ఎగిరే పావురమా, ఉగాది, పవిత్ర ప్రేమ, శివ పుత్రుడు, ఖైదీ గారు, మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి సినిమాలలోని నటి ‘లైలా’ మీకు గుర్తున్నారా? గుర్తులేకపోతే ఒక్కసారి పైన చెప్పిన సినిమాలోని ఏదైనా ఒక సినిమా అయినా చూడండి అప్పుడు గుర్తుకు వస్తుంది నటి లైలా గారు. ముఖ్యంగా ‘ఎగిరే పావురమా’ సినిమాలో జే.డి. చక్రవర్తి, శ్రీకాంత్ గారి ఇరువురి ప్రేమ మద్యల నలిగే అమ్మాయిగా సినిమా మొత్తం తనదైన గొప్ప నటన కనబరుస్తూ అప్పటి తరం యువతని మాయ చేసింది.

2006 సంవత్సరంలో ఇరానీ బిజినెస్ మ్యాన్ ‘మెహ్ దిన్’ ని పెళ్ళాడి పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు లైలా. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమారుడికి 8 సంవత్సరాలు, మరొక కుమారుడికి 6 సంవత్సరాలు. ఒక వైపు పెళ్లి, కుమారుల బాగోగులు చూసుకుంటున్న సమయంలో నటి లైలా గారికి సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ నిర్మాతలకి చేయలేనని ముక్కు సూటిగా చెప్పేవారు. తెలుగులో మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి సినిమా తర్వాత మరొక సినిమాలో కనిపించలేదు లైలా గారు.

తమిళంలో, మలయాళంలో అడపాదడపా సినిమాలలో అతిధి పాత్రలు, కథని మెలితిప్పే పాత్రలో తెర మీద కనపడుతూ ఆమె ఫ్యాన్స్ కి కొంత ఊరట ఇచ్చేవారు. అయితే లైలా గారికి మన తెలుగు సినిమాల మీద మమకారం ఎక్కువే. అందుకే మళ్ళీ తెర మీద కనిపించాలనుకున్న ఆమె కోరికకి పెళ్లి, కుమారులు అడ్డం అయ్యారు. అయిన సరే మాధ్యమాల్లో తన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉండాలని ప్రతి దినం ఎదో ఒక పోస్ట్ పెడుతూ తనకి తానుగా ప్రమోట్ చేసుకునే వారు. గత నెల రోజులుగా చూసుకుంటే లైలా గారి మాధ్యమాలు అయిన ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ ద్వారా తన పూర్వ వైభవాన్ని గుర్తుచేసేలా ఫొటోస్ పెడుతున్నారు.

ఆ ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, ఇక అనుకున్నట్లే తెలుగు తెరమీద ఒక్కసారి మెరుపుతీగ లాగ ప్రత్యక్షమయింది. కాకపోతే మొదట బుల్లితెర మీదకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పాత తరం నటీమణులు కొంతమంది బుల్లితెర మీద తమ సత్తా చాటుతున్నారు. అందువలన లైలా గారు మొదట బుల్లితెరకు ప్రాధాన్యత ఇవ్వాలి అనుకుంటున్నారు. ఒకప్పటి నటీమణులు రాధిక, రోహిణి, ఇంద్రజ, సంఘవి, మీనా, భూమిక వంటి వారు కూడా తమ సెకండ్ ఇన్నింగ్స్ ని తిరిగి మొదలు పెట్టారు. అందువలన లైలా గారికి చేరువైన పలువురు సన్నిహితులు ఆమెకి బుల్లితెర మీద సత్తా చాటమని సలహాలు ఇవ్వటం వలన మళ్ళీ బుల్లితెర మీద కనబడుతున్నారు.

ఈ మధ్య ఒక బుల్లితెర కార్యక్రమానికి హాజరు అయిన ఆమెని కొన్ని ప్రశ్నలు అడగగా పైన చెప్పినట్లు తన మనసులోని మాటలు బయటకి చెప్పేసింది. ఇక సినిమాల మీద మీ ఆసక్తి అని అడిగితే “సినిమాలలో తిరిగి చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు, ఆ పాత్రలు చేయాలి, ఈ పాత్రలు మాత్రమే చేయాలి అని నేను గిరి గీసి పెట్టుకోలేదు. సౌత్ సినిమాల నుండి నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. పలువురు నిర్మాతలకి కూడా నేను చెప్పాను మంచి కథ ప్రాధాన్యం ఉన్న పాత్రలు తీసుకురండి అని, అలాగే నాకు నెగటివ్ క్యారెక్టర్ చెయ్యాలి అని ఉంది” అని వెల్లడించారు లైలా గారు.

సెకండ్ ఇన్నింగ్స్ లో లైలా గారికి నటన మీద ఆసక్తి ఉన్నప్పటికీ మన తెలుగు దర్శకులు ఆమెకి మంచి పాత్రలు ఇస్తారో? లేదో? చూడాలి. తమిళంలో ఇప్పటికే ”ఆలిస్” అనే సినిమాని మొదలుపెట్టేసింది. ఆ సినిమాకి దర్శకులు ‘మణిచంద్రు’ గారు.