లండ‌న్ బ్యూటీని దించేస్తున్న జ‌క్క‌న్న‌!



లండ‌న్ బ్యూటీని దించేస్తున్న జ‌క్క‌న్న‌!
లండ‌న్ బ్యూటీని దించేస్తున్న జ‌క్క‌న్న‌!

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ `ఆర్ఆర్ఆర్‌`.  `బాహుబ‌లి` త‌రువాత రాజ‌మౌళి నుంచి రానున్న భారీ చిత్రం కావడంతో ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అందుకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో హాలీవుడ్ మూవీస్‌ని త‌ల‌ద‌న్నే విధంగా ఈ చిత్రాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా మ‌లుస్తున్నారు. రోమాంచిత ఘ‌ట్టాల స‌మాహారంగా విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ మూవీ వుండ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇటీవ‌ల  మూవీకి సంబంధించిన కీల‌క షెడ్యూల్ పూర్త‌యింది. 50 రోజుల పాటు రాత్రింబ‌వ‌ళ్లు సాగిన ఈ షెడ్యూల్‌లో రోమాంచిత‌మైన పోరాట ఘ‌ట్టాల‌ని రాజ‌మౌళి చిత్రీక‌రించార‌ట‌. తాజా షెఉడ్యూల్‌ని త్వ‌ర‌లో ప్రారంభించ‌బోతున్నారు. ఈ షెడ్యూల్ కోసం లండ‌న్ బ్యూటీ ఒలివియా మోరీస్ చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తోంద‌ట‌.

లండ‌న్‌లో స్కూల్ ఆఫ్ డ్రామాలో యాక్టింగ్ కి ప్ర‌త్యేక శిక్ష‌ణ తీసుకున్న ఒలివియా మోరీస్ `ఆర్ ఆర్ ఆర్‌`లో ఎన్టీఆర్‌కు జోడీగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న షెడ్యూల్‌లో ఒలివియాపై ప‌లు కీల‌క స‌న్నివేశాల్ని జ‌క్క‌న్న చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. చాలా రోజుల త‌రువాత `ఆర్ ఆర్ ఆర్‌` ఫైన‌ల్‌ షూట్ కోసం రాజ‌మౌళి లండ‌న్ బ్యూటీ ఒలివియా మోరీస్‌ని రంగంలోకి దించేస్తుండ‌టం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.