క‌రోనా ఎఫెక్ట్‌: `ఆది పురుష్‌` షూట్ ఆపేశారా?

Om raut clarity responds prabhas adipurush movie rumours
Om raut clarity responds prabhas adipurush movie rumours

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ అభిమాను‌ల‌తో పాటు స్టార్ హీరోల‌కు షాక్ ఇస్తూ వ‌రుస‌గా భారీ ప్రాజెక్ట్‌ల‌ని ప్ర‌క‌టించారు. `రాధేశ్యామ్‌` చిత్రంలో న‌టిస్తూనే `ఆది పురుష్‌`. స‌లార్ చిత్రాల‌తో పాటు నాగ్ అశ్విన్ తో  ఓ భారీ చిత్రాన్ని కూడా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇందులో `రాధేశ్యామ్‌` మూవీ షూటింగ్‌ని పూర్తి చేసిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఆదిపురుష్‌, స‌లార్ చిత్రాల్లో న‌టిస్తే బిజీగా వున్నారు.

ఇదిలా వుంటే ఓం రౌత్  తెర‌కెక్కిస్తున్న `ఆది పురుష్‌` షూటింగ్ ఆగిపోయింది అంటూ సోష‌ల్ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా `ఆది పురుష్` షూటింగ్ ఆగిపోయిందంటూ పుకార్లు మొద‌ల‌య్యాయి. అయితే ఈ పుకార్ల‌పై ద‌ర్శ‌కుడు ఓం రౌత్ స్పందించారు. `ఆది పురుష్‌` షూటింగ్ ఆగ‌లేద‌ని, ఎలాంటి అవాంత‌రం జ‌ర‌గ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇక యూనిట్ స‌భ్యుల్లో ఒక‌రికి కోవిడ్ సోకిన‌ట్టుగా వ‌స్తున్న వార్త‌ల్లోనూ ఎలాంటి వాస్త‌వం లేద‌ని వెల్ల‌డించారు. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ షూటింగ్ చేస్తున్నామ‌ని, సెట్‌లో ఏ ఒక్క‌రు కూడా కోవిడ్ బారిన ప‌డ‌లేద‌ని క్లారిటీ ఇచ్చారు. రామాయ‌ణ ఇతిమాసం నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రావ‌ణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ న‌టిస్తుండ‌గా సీత పాత్ర‌లో కృతి స‌న‌న్ న‌టిస్తోంది. 3డీ ఫార్మాట్‌లో అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీ రూపొందుతోంది.