పవన్ ని మళ్లీ టార్గెట్ చేసిన వర్మ , శ్రీరెడ్డి


Once again pawankalyan targetted by rgv and srireddyపవన్ కళ్యాణ్ ని మళ్లీ టార్గెట్ చేశారు దర్శకులు రాంగోపాల్ వర్మ , వివాదాస్పద నటి శ్రీరెడ్డి . ఈరోజు ఫిల్మ్ ఛాంబర్ కు వచ్చి సినిమా పెద్దలకు 24 గంటల సమయం ఇచ్చాడు పవన్ దాంతో మళ్లీ రాంగోపాల్ వర్మ పవన్ పై తనదైన శైలిలో విమర్శలు చేసారు. శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ ముందు చేసిన పని తప్పు అని చెప్పి పోలీసులను ఆశ్రయించమని హితువు చెప్పావ్ కానీ అదే విషయాన్ని మర్చిపోయినట్లున్నావ్ ? నువ్ పోలీసులను ఆశ్రయించకుండా ఫిల్మ్ ఛాంబర్ కు ఎందుకు వెళ్లావు అంటూ చురకలు అంటించాడు వర్మ .

ఇక శ్రీరెడ్డి కూడా ఏం తక్కువ తినలేదు , నీ హీరోయిజం సినిమాలో చూపెట్టూ అలాగే ఫిల్మ్ ఛాంబర్ లో చూపెట్టూ అంతేకాని జర్నలిస్ట్ ల మీద కాదు అంటూ ట్వీట్ చేసింది. అంతేనా …… నిన్ను , మీ అమ్మ ని తిడితే అంతగా కోపం వస్తుందా ? మరి మీ అభిమానులు మమ్మల్ని రేప్ చేస్తామని , చంపేస్తామని అనడమే కాకుండా మా అమ్మని కూడా తిడుతున్నారు. మిమ్మల్ని తిడితే తప్పా ….. మరి మమ్మల్ని మాత్రం తిట్టొచ్చా ? అని పవన్ కల్యాణ్ ని నేరుగా ప్రశ్నించింది శ్రీరెడ్డి.