వన్ బకెట్ ఛాలెంజ్ కి సిద్దమైన హీరోలు , హీరోయిన్ లు


One Bucket Challenge
One Bucket Challenge

హైదరాబాద్ లో నీళ్ల కొరత ఉండటంతో ఈనెల 21 న కేవలం ఒక బకెట్ నీళ్ల తోనే స్నానం చేయడం , పళ్ళు తోముకోవడం లాంటి పనులు చేయాలనే ఛాలెంజ్ మొదలయ్యింది . దాంతో ఆ ఛాలెంజ్ ని స్వీకరించడానికి పలువురు హీరోలు , హీరోయిన్ లు ముందుకు వచ్చారు . ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేసిన వాళ్లలో సమంత , వరుణ్ తేజ్ , సాయిధరమ్ తేజ్ , అడవి శేష్ , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , దర్శకులు నాగ్ అశ్విన్ తదితరులు ఉన్నారు .

వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా పలువురు ఈ వన్ బకెట్ ఛాలెంజ్ పై ఆసక్తితో ఉన్నారు . ఇప్పటికే చెన్నై లో నీళ్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు . సెలబ్రిటీలకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు కానీ వాళ్ళ అభిమానులను అలాగే ఇతరులకు అవగాహన కల్పించడానికే వాళ్ళు ఇలా వన్ బకెట్ ఛాలెంజ్ కు సిద్ధమయ్యారు . అంటే నీళ్ళని వృధా చేయకండి ,పొదుపుగా నీటిని వాడండి అని చెప్పడానికే ఈ ఛాలెంజ్ .