మ‌రో బోల్డ్ పాత్ర‌లో సునీల్ హీరోయిన్!


మ‌రో బోల్డ్ పాత్ర‌లో సునీల్ హీరోయిన్!
మ‌రో బోల్డ్ పాత్ర‌లో సునీల్ హీరోయిన్!

సునీల్ `భీమ‌వ‌రం బుల్లోడు`లో న‌టించిన ఏస్తేర్ ఇటీవ‌ల ష‌కీలా జీవిత క‌థ ఆధారంగా రూపొందిన `ష‌కీలా` చిత్రంలో ష‌కీలాకు డూపుగా న‌టించి సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. బోల్డ్ పాత్ర‌లో న‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచిన ఏస్తేర్ మ‌రోసారి డేరింగ్ పాత్ర‌లో బోల్డ్‌గా న‌టించ‌బోతోంది. ఆమె న‌టిస్తున్న తాజా చిత్రం `హీరోయిన్‌`. తిరుప‌తి ఎస్‌.ఆర్ ద‌ర్శ‌కుడు.

`సొసైటీ క‌ళ్ల‌ప్ప‌గించి చూసే క‌ళారంగం వెన‌క గుండె ప‌గిలే గాయం వుంది. మ‌నం చూసే ప్ర‌తి అద్భుతం వెన‌క మ‌రో నిజం ఒక‌టి దాగి వుంది అంటున్నారు ద‌ర్శ‌కుడు తిరుప‌తి ఎస్‌.ఆర్‌. `ఉత్త‌ర‌` చిత్రంలో మంచి పేరు తెచ్చుకున్న ఈ ద‌ర్శ‌కుడు ఏస్తేర్ టైటిల్ పాత్ర‌లో తెర వెనుక సిత్రాల‌ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఈ సినిమాలోని కొన్ని స‌న్నివేశాల్లో ఏస్తేర్ బోల్డ్‌గా క‌నిపించ‌నుంద‌ట‌.

తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఈ చిత్రాన్ని లీవ్ ఇన్ సి క్రియేష‌న్స్ నిర్మించ‌బోతోంది. ఎరోటిక్ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నారు. ఏస్తేర్‌కు మంచి పేరు తెచ్చే చిత్ర‌మిది. త్వ‌ర‌లో ఈ మూవీలో న‌టించే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని వెల్ల‌డిస్తామ‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు.