వెంకీ కోసం మ‌రో భామ‌ని దించేస్తున్నారు!One more Heroine in Venkatesh Narappa
One more Heroine in Venkatesh Narappa

త‌మిళంలో ధ‌నుష్ హీరోగా న‌టించిన చిత్రం `అసుర‌న్‌`. వెట్రిమార‌న్ ద‌ర్శ‌క‌త్వంలో క‌లైపులి ఎస్ థాను నిర్మించిన ఈ చిత్రం త‌మిళంలో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ధ‌నుష్ ఓల్డ్ గెట‌ప్‌లో చూపించిన ఆహార్యం, ఆవ‌భావాలకు విమ‌ర్శ‌కులు సైతం ప్ర‌శంస‌లు కురిపించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో `నార‌ప్ప‌` పేరుతో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని క‌లైపులి ఎస్ థాను స‌మ‌ర్ప‌ణ‌లో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి. సురేష్‌బాబు నిర్మిస్తున్నారు. శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమా కీల‌క షెడ్యూల్ త‌మిళ‌నాడు లోని రెడ్ డీసెర్ట్‌లో జ‌రుగుతోంది. ఇక్క‌డే కీల‌క స‌న్నివేశాల్ని చిత్రీక‌రిస్తున్నారు.
పీట‌ర్ హెయిన్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. రెడ్ డిసార్ట్‌లో షూట్ చేస్తున్న ఫైట్స్ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలుస్తాయ‌ట‌.

ఇందులో ఓ హీరోయిన్‌గా ప్రియ‌మ‌ణి న‌టిస్తోంది. మ‌రో నాయిక‌గా మ‌ల‌యాళ భామని చిత్ర బృందం ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది. రెబా మోనికా జాన్‌ని రెండ‌వ హీరోయిన్‌గా సురేష్‌బాబు ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది. రెబా మోనికా జాన్ ఇటీవ‌ల విజ‌య్ హీరోగా న‌టించిన `బిగిల్` చిత్రంలో న‌టించింది.