బాల‌కృష్ణ – బోయ‌పాటి కోసం మ‌రో టైటిల్‌!


బాల‌కృష్ణ - బోయ‌పాటి కోసం మ‌రో టైటిల్‌!
బాల‌కృష్ణ – బోయ‌పాటి కోసం మ‌రో టైటిల్‌!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ, బోయపాటి శ్రీ‌ను ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి క‌లిసి ఓ భారీ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు అనూహ్య విజ‌యాన్ని సాధించి బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టాయి. దీంతో మూడ‌వ సారి వీరిద్ద‌రూ క‌లిసి చేస్తుండ‌టంతో తాజా చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవ‌ల బాల‌కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన బీబీ3 ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్  సినిమా ఎలా వుండ‌బోతోందో జ‌స్ట్ శాంపిల్‌గా రుచి చూపించ‌డంతో అభిమానుల్లో ఆనందానికి హ‌ద్దే లేకుండా పోయింది. టీజ‌ర్‌లో బాల‌య్య చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌, పంచె క‌ట్టుతో బాల‌య్య స‌రికొత్త‌గా క‌నిపించారు. వైట్ అండ్ వైట్ లో లుంగీ ధ‌రించి గుబురు మీసాల‌తో బాల‌య్య అద‌ర‌గొట్టేశారు. దీంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ చిత్రానికి `మోనార్క్‌` అని, లేదు `డేంజ‌ర్‌` అని రెండు టైటిల్స్ వినిపించాయి.

అయితే తాజాగా మ‌రో పేరు వినిపిస్తోంది. `టార్చ్ బేర‌ర్‌` అనే టైటిల్ తాజాగా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. జ‌నం కోసం బాల‌య్య ఎలాంటి ఇబ్బందులైనా ప‌డ‌టానికి ముందుంటార‌ట‌. అందుకే ఈ చిత్రానికి `టార్చ్ బేర‌ర్‌` అనే టైటిల్ క‌రెక్ట్‌గా స‌రిపోతుంద‌ని బోయ‌పాటి శ్రీ‌ను భావిస్తున్నార‌ట‌. ఇందులో బాల‌య్య ట్విన్స్‌గా ద్విపాత్రాభిన‌యం చేస్తున్న విష‌యం తెలిసిందే. కీల‌క స‌న్నివేశాల‌ని క‌రోనాకు ముందు పూర్తి చేసుకున్న ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ విష‌యంలో మాత్రం ఇంకా సందిగ్ధ‌త వ్య‌క్త‌మ‌వుతోంది.