మ‌రో న‌టుడికి క‌రోనా.. షూటింగ్‌కి బ్రేక్‌!

మ‌రో న‌టుడికి క‌రోనా.. షూటింగ్‌కి బ్రేక్‌!
మ‌రో న‌టుడికి క‌రోనా.. షూటింగ్‌కి బ్రేక్‌!

క‌రోనా మ‌హ‌మ్మారి సినీ, టీవీ ఇండ‌స్ట్రీల‌కు ద‌డ‌పుట్టిస్తోంది. క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డంతో టీవీ, సినిమా షూటింగ్‌ల‌కు గ‌త రెండున్న‌ర నెల‌లుగా బ్రేక్ ప‌డింది. అయితే రెండున్న నెల‌ల త‌రువాత కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్‌లో స‌డ‌లింపులు ఇవ్వ‌డం, టీవీ, సినీ షూటింగ్‌ల‌కు అనుమ‌తులు ఇవ్వ‌డంతో షూటింగ్‌ల‌ హ‌డావిడి మొద‌లైంది. అయితే వారం తిర‌క్కుండానే టీవీ షూటింగ్‌ల‌లో అల‌జ‌డి మొద‌లైంది.

`సూర్యాకాంతం` టీవీ సీరియ‌ల్ న‌టుడు ప్ర‌భాక‌ర్‌కు క‌రోనా వైర‌స్ సోక‌డంతో టీమ్ అంతా బిత్త‌ర‌పోయింది. ఊహించ‌ని ప‌రిణామానికి షాక్ తిన్న టీమ్ వెంట‌నే టీమ్ టీమ్ అంతా క‌రోనా ప‌రీక్ష‌ల‌కు వెళ్లింది. ఇదిలా వుంటే తాజాగా మ‌రో టీవీ సీరియ‌ల్ న‌టుడు క‌రోనా బారిన ప‌డ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. `ఇంటింటి గృహ‌ల‌క్ష్మి` టీవీ సీరియ‌ల్‌లో న‌టిస్తున్న హ‌రికృష్ణ‌కు క‌రోనా సోకింద‌ని తెలిసింది. అనుమానం వ‌చ్చి అత‌నికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్ అని నిర్థార‌ణ అయ్యింది.

దీంతో శుక్ర‌వారం జ‌ర‌గాల్సిన షూటింగ్‌ని మేక‌ర్స్ వాయిదా వేశారు. హ‌రికృష్ణ ఇటీవ‌ల క‌రోనా సోకిన ప్ర‌భాక‌ర్‌తో స‌న్నిహితంగా వున్నాడ‌ని, అత‌ని కార‌ణంగానే హ‌రికృష్ణ‌కు క‌రోనా సోకింద‌ని చెబుతున్నారు. దీంతో ప్ర‌భాక‌ర్‌తో క‌లిసి న‌టించిన వారు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు. త‌మ‌కు కూడా క‌రోనా సోకి వుంటుంద‌ని భ‌య‌ప‌డుతున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించాల‌ని సిబ్బంది కోరుతున్నార‌ని తెలిసింది.