అంచలంచెలుగ ఎదగాలి అంటే మారుపేరు అయిన మాటలకి ఉదాహరణ “మహేష్”!

Mahesh Achanta
అంచలంచెలుగ ఎదగాలి అంటే మారుపేరు అయిన మాటలకి ఉదాహరణ “మహేష్”!

“మహేష్ ఆచంట” పేరు మొదటగా ఒక కామెడీ షోలొ వినిపించిన పేరు, తర్వాత ఒక దర్శకుడు అవకాశం ఇవ్వడం, వెంటవెంటనే సినిమాల ద్వార జనాలకి బాగా దగ్గరయ్యాడు, అల దగ్గరవ్వటం లోనే తన ప్రతిభ కనబడింది అంటే అది అతని పట్టుదల, సినిమాల విషయంలో అతనికి ఉన్న బాధ్యత.

ఒక్క ఛాన్స్ వొస్తే వొదులుకోకుండా అల ఒక్క ఛాన్స్ లొ తనని నమ్మి తన సినిమాకి నిర్మాత ఒప్పుకోవడం, అవకాశం ఇవ్వడం, అవకాశం అంటే పక్కన ఉండే క్యారెక్టర్ కాదు, అసలైన హీరో.ఒక చిన్న రోల్ నుండి అసలైన హీరో అంటే చాలా మంది నిర్మాతలు భయపడేది ఇక్కడే కాని, ఆ నిర్మాత మహేష్ మీద అతని సినిమాల మీద నమ్మకంగా ఉన్నాడు అని మనం యిట్టే చెప్పేయొచ్చు. ఇప్పటివరకు గుర్తుండిపోయే పాత్రలు చేసాడు, ఇకపైన నన్ను నమ్మాలి జనం నాకు జేజేలు పలకాలి అని సినిమా చేయలేదు, జనాలు ఇలాంటి సినిమాలని కూడా చూస్తారు అని జనం నాడి తెలిసిన మనిషి కాబట్టి తన బాధ్యతగ చేస్తున్న సినిమా “నేను నా నాగార్జున”.

ఇక ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే ముందుగా తనలో ఉన్న నటన గురించి మాట్లాడాలి, అబ్బో ఇతగాడి నటన మనం చూసింది కూడా ఎక్కువే, ఉదాహరణకి “రంగస్థలం“, “మహానటి”, ఈ మధ్య “గుణ 369”. రంగస్థలం, మహానటి వంటి సినిమాలు అవార్డ్స్ కూడా గెలుచుకోవడం మనం చూసాం, ఇక గుణ 369 సినిమా విజయంలొ తన పాత్ర కూడా సినిమా విజయానికి కారణం అంటే అది అతిశయోక్తి కాదు.

ముందుగా ఈ సినిమాకి మన అందరి తరపున మహేష్ ఆచంట గారికి విజయం దక్కాలి అని వేడుకుంద్దాం అల్ ది బెస్ట్ “నేను నా నాగార్జున” అనే సినిమా యూనిట్ మొత్తం విభాగానికి.

Credit: Facebook