ఆన్‌లైన్ సెన్సార్‌కు లైన్ క్లియ‌ర్‌!


ఆన్‌లైన్ సెన్సార్‌కు లైన్ క్లియ‌ర్‌!
ఆన్‌లైన్ సెన్సార్‌కు లైన్ క్లియ‌ర్‌!

క‌రోనా కార‌ణంగా జ‌న జీవితం స్థ‌భించిపోయింది. ప్ర‌తీ రంగం న‌డ్డి విరిపోయింది. లాక్‌డౌన్ కార‌ణంగా అంతా ఇంటి ప‌ట్టునే వుంటుండ‌టంతో ఏ బిజినెస్ కూడా ర‌న్ కావ‌డం లేదు. షాప్స్‌, షాపింగ్ మాల్స్‌, సినిమా థియేట‌ర్స్ అన్నీ మూసివేయ‌బ‌డ్డాయి. ఎక్క‌డ చూసినా క‌రోనా.. క‌రోనా.. దీంతో సినిమాల ప‌రిస్థితుల మ‌రింత దారుణంగా మారింది.

థియేట‌ర్లు తెరిచే ప‌రిస్థితి లేక సినిమా షూటింగ్‌లకు అనుమ‌తి లేక‌పోవ‌డంతో సినిమా వాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్ప‌టికే చాలా సినిమాలు రిలీజ్‌కు రెడీగా వున్నాయి. కొన్ని సెన్సార్‌కు సిద్ధంగా వున్నాయి. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన కేంద్ర సెన్సార్ బోర్డ్ సినీ వ‌ర్గాల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. చాలా రోజులుగా సినీ ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు జాతీయ సెన్సార్ బోర్డు స్పందించాల‌ని కోరిన నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌టం గ‌మ‌నార్హం.

సెన్సార్ ఆకుండా ఆగిపోయిన సినిమాల‌కు ఆన్‌లైన్‌లో సెన్సార్ చేసుకోవ‌చ్చ‌ని అనుమ‌తులిచ్చింది. ఇది నిజంగా నిర్మాత‌ల‌కు గుడ్ న్యూసే. ఎందుకంటే ఇంత‌కు ముందు ఓ సినిమాని సెన్సార్ చేయించాలంటే ప్ర‌త్యేకంగా సెన్సార్ స‌భ్యుల కోసం షో ఏర్పాటు చేయాలి. నిర్మాత అక్క‌డే వారి కోసం ఎదురుచూస్తూ వుండాలి. కానీ ఇప్పుడు మాత్రం నిర్మాత ఎక్క‌డ ప్ర‌ద‌ర్శ‌న ఏర్పాటు చేస్తే సెన్సార్ బోర్డ్ మెంబ‌ర్స్ అక్క‌డికే వ‌చ్చి సినిమా చూస్తారు. త‌రువాత ఈమెయిల్ ద్వారా స‌ర్టిఫికెట్ జారీ చేస్తారు.