రెండే రెండు పాటలతో సైరా విడుదల


Sye Raa Narasimha Reddy
రెండే రెండు పాటలతో సైరా విడుదల

తెలుగు సినిమా ఇప్పుడు వెలిగిపోతోంది. బాలీవుడ్ స్థాయిని దాటి హాలీవుడ్ ప్రమాణాలను అందుకోవడానికి ఇప్పుడు తెలుగు పరిశ్రమ కసరత్తులు చేస్తోంది. టెక్నికల్ గా మనం ఎంత ఎదిగినా, మన సినిమాల్లో పాటలు అనేవి కంపల్సరీ. బాహుబలి వంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ లో కూడా పాటలు కీ రోల్ ప్లే చేసాయి. మన సినిమాలలో పాటలు లేకుండా అంటే ఊహించుకోవడం కూడా కష్టం. అయితే ఈ అక్టోబర్ 2న విడుదల కావాల్సి ఉన్న సైరాలో మాత్రం రెండే పాటలు ఉన్నాయిట. మరో పాట బ్యాక్ గ్రౌండ్ లో వస్తుందని తెలుస్తోంది.

మొదట ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా రెహమాన్ ను అనుకున్నా ఆ సమయంలో ఆయన బిజీగా ఉండడంతో అమిత్ త్రివేదిని తీసుకున్నారు. ఎక్కువ పాటలు పెట్టి సినిమా ఫ్లోను దెబ్బ తీయడం ఇష్టంలేకే చిత్ర యూనిట్ రెండు పాటలకే పరిమితం చేసింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం జూలియస్‌ పేకియమ్‌ అందించాడు. ఈ మూడు పాటలు కూడా సీతారామశాస్త్రి రాసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సైరా ప్రీ రిలీజ్ వేడుక సెప్టెంబర్ 15న నిర్వహించే అవకాశముంది.