ఇస‌య‌జ్ఞానికి ప‌రీక్ష పెట్టిన క‌లెక్ష‌న్‌కింగ్!

Only a legend can do it - Manchu Vishnu
Only a legend can do it – Manchu Vishnu

విల‌క్ష‌ణ న‌టుడు, క‌లెక్ష‌న్‌కింగ్ మోహ‌న్‌బాబు కొంత విరామం త‌రువాత ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `స‌న్ ఆఫ్ ఇండియా`. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శ్రీ‌లక్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్, 24 ఫ్రేమ్స్ బ్యాన‌ర్‌పై హీరో మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. పొలిటిక్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి మ్యాస్ట్రో, ఇస‌య‌జ్ఞాని ఇళ‌య‌రాజా సంగీతం అందిస్తున్నారు.

దేశ భ‌క్తి ప్ర‌ధానంగా సాగే ఈ చిత్రం స‌మ‌కాలీన రాజ‌కీయాల‌పై వ్యంగ్యాస్త్రంగా తెర‌కెక్కుతోంది. ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో మోహ‌న్‌బాబు న‌టిస్తున్న ఈ చిత్రానికి చాలా ఏళ్ల త‌రువాత ఇళ‌యరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ కోసం ఇస‌య‌జ్ఞాని ఇళ‌య‌రాజాకు క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు గట్టి ప‌రీక్ష పెట్టారు. ర‌‌ఘువీర గ‌ద్యంని ఈ మూవీ కోసం రీమిక్స్ చేయ‌బోతున్నారు.

అయితే మోహ‌న్‌బాబు చెబుతుండ‌గా విన్న ఇళ‌యారాజా చాలా క‌ష్టంగా వుందే ట్యూన్ ఎవ‌రూ చేయ‌లేరు అంటున్న వీడియో ఆక‌ట్టుకుంటోంది. లేదండీ మీరే చేయ‌గ‌ల‌రు` అంటూ మోహ‌న్‌బాబు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోని షేర్ చేసిన హీరో, నిర్మాత మంచు విష్ణు ఆస‌క్తిర పోస్ట్‌ని షేర్ చేశారు. `ఇతిహాసాలతో సినిమా తీయడం నాకు దేవుడు పంపిన అవకాశం. పాటలో ఒక ఐకానిక్ గద్యం చేయడం ఒక్క లెజెండ్‌కు సాధ్యం. అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. పాటను దృశ్యమానంగా చూడటం మరొక కథ. నేను త్వరలోనే మీతో పంచుకుంటాను`అని ట్వీట్ చేశారు మంచు విష్ణు.