రానా – మిహీకా వెడ్డింగ్‌కి ఆహ్వానం వారికే!only close people will attend ranas wedding ceremony
only close people will attend ranas wedding ceremony

ద‌గ్గుబాటి రానా, మిహీకా బ‌జాజ్‌ల వెడ్డింగ్ హంగామా మొద‌లైంది. ఈ నెల 8న రానా, మిహీకాల వివాహం జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్‌లోని ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన తాజ్ ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుక అంగ‌రంగ వైభ‌వంగా లిమిటెడ్ అతిథుల మ‌ధ్య జ‌రిపించాల‌ని ప్లాన్ చేశారు. అయితే క‌రోనా తీవ్ర‌త నేప‌థ్యంలో వివాహ వేదిక తాజ్ ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ నుంచి రామానాయుడు స్టూడియోస్‌కి మారిన‌ట్టు తెలిసింది.

ఇందు కోసం చాలా రోజుల క్రిత‌మే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాన్ ఏ లేదా ప్లాన్ బి ని ఫాలో అవ్వాల‌ని భారీ గానే ప్లాన్ చేశారు. కానీ క‌రోనా ప్ర‌భావం రోజు రోజుకీ పెరిగిపోవ‌డంతో ప్లాన్ బికే ఫిక్స‌యిపోయార‌ట‌. ఈ నెల 8 వ‌ర‌కు క‌రోనా ఉధృతి త‌గ్గితే అట్ట‌హాసంగా.. త‌గ్గ‌ని ప‌రిస్థితుల్లో అత్యంత స‌న్నిహితుల మ‌ధ్య వివాహం చేసుకోవాల‌ని రానా, మిహీకా ప్లాన్ చేసుకున్నారు. ప‌రిస్థితుల్లో మార్పులు క‌నిపించ‌క‌పోవ‌డంతో పెళ్లికి ఇండ‌స్ట్రీ నుంచి కేవ‌లం 30 మందికి మాత్ర‌మే ఆహ్వానం వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

ఆ 30 మంది కూడా క‌రోనా టెస్టులు చేయించుకున్న త‌రువాతే వివాహ వేడుక‌లో హాజ‌ర‌వుతార‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌న్న‌ది ప‌క్క‌న పెడితే రానా, మిహీకాల వివాహం మాత్రం చాలా నిరాడంబ‌రంగా, అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో మాత్రంమే జ‌ర‌గ‌నుంద‌ని తాజా న్యూస్.