జాను సినిమాలో మరో క్లాసికల్ – “ఊహలే…ఊహలే..” 

Oohale song from Jaanu Movie
Oohale song from Jaanu Movie

శర్వానంద్, సమంత జంటగా తమిళ దర్శకుడు ప్రేమ కుమార్ తెరకెక్కిస్తున్న తమిళ 96 సినిమా రీమేక్ అయిన జాను సినిమా నుండి టీమ్ మరొక సాంగ్ ను రిలీజ్ చేసింది. తమిళ మాతృక అయిన 96లో పెద్ద హిట్ గా నిలిచి ఇప్పటికీ మూవీ లవర్స్ అందరూ హమ్ చేసుకుంటున్న “కాదలే… కాదలే” పాటను తెలుగులో “ఊహలే… ఊహలే..” పేరుతో రిలీజ్ చేసారు. ఇక ఈ పాట తెలుగులో కూడా ఫుల్ వైరల్ అవుతోంది. ఇక ఈపాట లో హైలెట్ అనిపించే అంశాలు మ్యూజిక్ డైరెక్టర్ గోవింద్ వసంత స్వయంగా స్వరపరిచిన వయోలిన్ మ్యూజిక్, చిన్మయి శ్రీపాద గొంతు, కిరణ్ గారి ఫ్లూట్ మ్యూజిక్.

96 సినిమాను చూడకుండా, ఈ పాట విని,వెంటనే కనెక్ట్ అయ్యి, చాలాకాలం తరువాత ఈ పాట ఈ సినిమాలోది అని తెలుసుకుని మళ్ళీ 96 సినిమాను రిపీటెడ్ గా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 2018 అక్టోబర్ లో రిలీజ్ అయిన 96 ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రేండింగ్ టాపిక్. ఈసినిమా తరువాత సౌత్ ఇండస్ట్రీ లవ్ స్టోరీస్ మీద మళ్ళీ ఒక బలమైన ఒపీనీయన్ వచ్చింది అందరికీ. ఇక ఈ ఊహలే.. ఊహలే పాటకు సాహిత్య సవ్యసాచి శ్రీమణి గారు లిరిక్స్ రాసారు. ఇప్పుడు తెలుగు వెర్షన్ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో no 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. సినిమా అనే ఒక బ్రహ్మ పదార్ధానికి బాష,ప్రాంత అనే బేధాలు లేవనీ, వాటన్నిటికీ అతీతంగా అందారూ కంటెంట్ లో ఉన్న భావానికే కనెక్ట్ అవుతారని ఈ పాట మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసింది.