ఆపరేషన్ గోల్డ్ ఫిష్ టీజర్ టాక్


Operatin gold fish teaser talk

ఆది హీరోగా వినాయకుడు ఫేమ్ సాయి కిరణ్ అడవి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ”. కాశ్మీర్ పండిట్ లు ఉగ్రవాదం వల్ల ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు , ఆ సమస్యలను ఎన్ ఎస్ జి కమాండర్ ఎలా పరిష్కరించాడు అన్న కథాంశంతో రూపొందిన చిత్రమే ఈ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ . ఎన్ ఎస్ జి కమాండర్ అర్జున్ పండిట్  గా ఆది నటించగా అత్యంత ప్రమాదకారి అయిన తీవ్రవాది ఘాజి బాబా గా ప్రముఖ రచయిత అబ్బూరి రవి నటించాడు .

 

ఇక ఈ టీజర్ ని ఈరోజు హీరో మహేష్ బాబు లాంచ్ చేసాడు . టీజర్ చాలా ఇంప్రెసివ్ గా ఉండటంతో ఆపరేషన్ గోల్డ్ ఫిష్ పై అంచనాలు పెరిగాయి . సాయి కిరణ్ అడవి ఇంతకుముందు తీసిన చిత్రాలు వినాయకుడు , కేరింత ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని అలరించాయి పైగా వాటికీ పూర్తి భిన్నమైన పంథాని ఎంచుకొని చేసిన సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్ . టీజర్ తో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి దాంతో చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది .

English Title: Operatin gold fish teaser talk