
కరోనా వైరస్ యావత్ ప్రంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్కడి వారు అక్కడే అన్న చందంగా జనజీవితం స్థంభించిపోయింది. కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పప్రభుత్వాలు సేఫ్టీ కోసం రెండు వారాల పాటు స్కూళ్లని, సినిమా థియేటర్లని బంద్ చేయాలని అదేశాలు జారీ చేశాయి. దీంతో జనం అత్యధిక శాతం ఇళ్లల్లోనే వుండటం మొదలుపెట్టారు. కాల క్షేపం కావాలంటే టీవీతో పాటు ఇంటర్నెట్ ప్రధానంగా వాడటం మొదలు పెట్టారు.
థియేటర్లు లేకపోవడంతో డిజిటల్ ఓటీటీలకు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ 5 ప్లాట్ ఫామ్ లకు మరింత డిమాండ్ పెరిగిపోయింది. ఇటీవల విడుదలైన సినిమాలు రెండు వారాల పాటు ప్రదర్శనకు నోచుకోకపోవడంతో నిర్మాతలు తెలివిగా తమ చిత్రాలని అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్‌లకు అమ్మేస్తున్నారు. తాజాగా బ్రహ్మాజీ ప్రచారం చేసిన `ఓ పిట్టకథ` అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతోంది. మంగళవారం నుంచి ఈ చిత్రం అమెజాన్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.
కొత్త తరహా థ్రిల్లర్‌గా నాలుగు పాత్రల నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి. ఆనందప్రసాద్ నిర్మించారు. చందు ముద్దు దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో విశ్వాంత్, సంజయ్, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ ప్రధాన పాత్రల్లో నటించారు.