శ్రీరెడ్డి కి మద్దతు ఉపసంహరించుకున్న ఓయు


Osmania University (OU) JAC withdraw support to Sri Reddyవివాదాస్పద నటి శ్రీరెడ్డి కి ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు తమ మద్దతు ని ఉపసంహరించుకున్నారు. శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం న్యాయమైంది కాబట్టి బేషరతుగా మద్దతు ఇచ్చాం కానీ ఆమె పోరాట పంథా మార్చి బ్లాక్ మెయిల్ చేసేలాగా ఉండటంతో , పవన్ కల్యాణ్ ని ఘోరంగా అవమానించడంతో మా మద్దతు ఉపసంహరించుకుంటున్నామని స్పష్టం చేశారు ఓయు స్టూడెంట్స్.

శ్రీరెడ్డికి తొలుత అందరినుండి మద్దతు లభించింది కానీ లీకుల మీద లీకులు ఇస్తూ కొంతమంది ని పర్సనల్ గా టార్గెట్ చేయడం పవన్ కల్యాణ్ ని బూతులతో తిట్టడంతో ఒక్కసారిగా శ్రీరెడ్డి పై వ్యతిరేకత మొదలయ్యింది కట్ చేస్తే ఉస్మానియా స్టూడెంట్స్ మద్దతు కూడా పోయింది.