బిగ్ బాస్ కు వార్నింగ్ ఇస్తున్న ఓయూ స్టూడెంట్స్


OU students warns Bigg boss
OU students warns Bigg boss

బిగ్ బాస్ కు వార్నింగ్ ఇస్తున్న ఓయూ స్టూడెంట్స్

తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టుగా నిలిచిన ఓయూ స్టూడెంట్స్ బిగ్ బాస్ కి వార్నింగ్ ఇచ్చారు . అసభ్యత , అశ్లీలత తో నిండి ఉండే బిగ్ బాస్ 3 ని అంగీకరించేది లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు . తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తే హీరో నాగార్జున ఇంటి తో పాటుగా షో నిర్వాహకుల ఇళ్లను ముట్టడిస్తామని సవాల్ విసిరారు . అసలే రకరకాల వివాదాలు చుట్టుకుంటున్నాయి బిగ్ బాస్ కు ఇక ఇప్పుడేమో ఓయూ స్టూడెంట్స్ కూడా వార్న్ చేయడంతో బిగ్ బాస్ పై నీలినీడలు కమ్ముకున్నాయి .

యాంకర్ శ్వేతా రెడ్డి , నటి గాయత్రి గుప్తా తదితరులు బిగ్ బాస్ షో నిర్వాహకులపై కేసులు పెట్టిన విషయం తెలిసిందే . బిగ్ బాస్ ఇష్యు పెద్దది కావడంతో హైకోర్టు వరకు వెళ్ళింది వ్యవహారం . అయితే మేము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు బిగ్ బాస్ నిర్వాహకులను అరెస్ట్ చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు . ఇక తదుపరి విచారణని ఈనెల 24 కు వాయిదావేసింది .