ఓవర్ సీస్ లో దుమ్మురేపిన స్టార్ హీరోలు వీళ్ళే !


టాలీవుడ్ చిత్రాలు ఓవర్ సీస్ లో కూడా దుమ్మురేపుతున్నాయి . ఒకప్పుడు తెలుగు చిత్రాలకు ఓవర్ సీస్ లో అంతగా మార్కెట్ లేదు కానీ ఇప్పుడు రోజులు మారాయి దాంతో టాలీవుడ్ చిత్రాలకు ఓవర్ సీస్ లో మంచి మార్కెట్ ఏర్పడింది . ఓవర్ సీస్ లో పలువురు స్టార్ హీరోల చిత్రాలకు ఆదరణ ఉంది కానీ ఎక్కువ చిత్రాలు వన్ మిలియన్ డాలర్ల ని అందుకున్న హీరోలలో మాత్రం మహేష్ బాబు దే అగ్ర స్థానం . చిత్రాల ప్లాప్ , హిట్ లతో సంబంధం లేకుండా వన్ మిలియన్ మార్క్ ని అందుకున్న హీరోలలో మహేష్ బాబు(8) , జూనియర్ ఎన్టీఆర్( 6) , నాని(6) లు ఉన్నారు . ఆ హీరోల చిత్రాల లిస్ట్ ఓసారి చూద్దాం .

 

మహేష్ బాబు 8 చిత్రాల లిస్ట్

1) దూకుడు (2011)
2) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013)
3) ఆగడు (2014)
4) 1 నేనొక్కడినే (2014)
5) శ్రీమంతుడు (2015)
6) భరత్ అనే నేను (2018)
7) బ్రహ్మోత్సవం (2016)
8) స్పైడర్ (2017)

 

ఎన్టీఆర్ 6 చిత్రాల వివరాలు

1) బాద్ షా (2013)
2) టెంపర్ (2015)
3) నాన్నకు ప్రేమతో (2016)
4) జనతా గ్యారేజ్ (2016)
5) జై లవకుశ (2017)
6) అరవింద సమేత (2018)

 

నాని 6 చిత్రాల లిస్ట్

1) ఈగ (2012)
2) భలే భలే మగాడివోయ్ (2015)
3) జెంటిల్ మెన్ (2016)
4) నేను లోకల్ (2017)
5) నిన్ను కోరి (2017)
6) జెర్సీ (2019)