ప్రముఖుల సమక్షంలో ” పాచిక” షార్ట్ ఫిల్మ్ విడుదల


Pachika short film released

ప్రతిభ ను పరిచయం చేసే విదంగా నేడు షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి అన్నారు.. “గౌరు ఎంటర్ ప్రైజెస్” బ్యానర్ పై యువకుడు గౌరి నాయుడు నటిస్తు ..దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ “పాచిక” ఈ షార్ట్ ఫిల్మ్ ను సినీ ప్రముఖుల సమక్షంలో ఇటీవల ప్రసాద్ లాబ్ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. పాచిక అనే తెలుగు పదాన్ని టైటిల్ గా పెట్టడం బాగుంది. కామన్ పాయింట్ ను తీసుకుని అందరికి నచ్చేలా తీశాడు. గతంలో ఎవరయినా తమ ప్రతిభ కనభరచాలంటే ఆల్బం తీసుకుని ఆఫీస్ ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ వేదికగా మారాయి.

దర్శకుడు గౌరి కి నా అభినందనలు.. నిర్మాత తుమ్మల పల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. షార్ట్ ఫిల్మ్ కి బిగ్ ఫిల్మ్ కి తేడా సమయం మాత్రమే అన్నారు. పాకెట్ మని తో తీసే దర్శకుడు బాహుబలి లాంటి సినిమా తీయగలడు. షార్ట్ ఫిల్మ్ లో ప్రతిభ కనభరిచిన వారికి త్వరగా సినిమా అవకాశాలు లభిస్తాయి. అందరికి అర్ధమయ్యే విదంగా తీసిన గౌరు నాయుడు ని అభినందించాలి.అన్నారు. దర్శకుడు గౌరు నాయుడు మాట్లాడుతూ.. సామాజిక అంశాన్ని తీసుకుని చేసిన “పాచిక” షార్ట్ ఫిల్మ్ కు సంగీతం. కేమెరా ప్రాణం గా నిలిచాయి. మిగిలినవారు బాగా సహకరించారు. రాజ్ కందుకూరి .రామసత్యనారాయణ .లక్మి భూపాల్ గార్ల కు నా కృతజ్ఞతలు. తెలిపారు. ఈ షార్ట్ ఫిల్మ్ కు నిర్మాత లు. రాము నాయుడు. సరోజిని. రచనా. దర్శకుడు. గౌరు నాయుడు.