పడిపడి లేచె మనసు టీజర్ టాక్

padipadileche manasu teaser talkశర్వానంద్సాయి పల్లవి జంటగా హను రాఘవాపుడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ” పడిపడి లేచె మనసు ”. డిసెంబర్ 21 న విడుదల కానున్న ఈ చిత్ర టీజర్ ని ఈరోజు విడుదల చేసారు . వరుస విజయాలతో జోరు మీదున్న శర్వానంద్ కు కాస్త బ్రేక్ పడినప్పటికీ ధైర్యం చేసి లై అనే డిజాస్టర్ సినిమాని అందించిన హను రాఘవాపుడి చెప్పిన కథ నచ్చి ధైర్యంగా ముందడుగు వేసాడు శర్వా . కట్ చేస్తే అతడి ధైర్యం నిజమే అనిపిస్తోంది టీజర్ చూసాక . సాయి పల్లవి మరోసారి ప్రేక్షకులను ఫిదా చేయడానికి వస్తున్నట్లుగా ఉంది టీజర్ . సాయి పల్లవి – శర్వా జోడి బాగుంది అలాగే హిట్ కొట్టేలాగే కనిపిస్తున్నారు .

ఫీల్ గుడ్ లవ్ స్టొరీ ని తలపించేలా ఉంది పడిపడి లేచె మనసు . ప్రేమకథ గా తెరకెక్కిన పడిపడి లేచె మనసు తో శర్వానంద్ మరోసారి తన విభిన్నత చాటుకునేలా ఉన్నాడు . ఎక్కువ రోజుల పాటు షూటింగ్ కార్యక్రమాలు జరుపుకున్నప్పటికి మొత్తానికి టీజర్ మాత్రం పాజిటివ్ వైబ్రేషన్స్ ని కలిగిస్తోంది . డిసెంబర్ 21 న ఈ సినిమా ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: padipadileche manasu teaser talk