100 కోట్ల దిశగా వివాదాస్పద చిత్రం


సినిమా రిలీజ్ కి ముందే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన చిత్రం ” పద్మావత్ ”. ఇక రిలీజ్ నుండి కూడా పలు విధ్వంసాలకు నెలవుగా మారింది ఈ చిత్రం . బోలెడు ఆంక్షలు , అల్లర్లు అయినప్పటికీ కలెక్షన్ల లో మాత్రం వెనకడుగు వేయలేదు ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరడానికి శరవేగంగా దూసుకుపోతోంది పద్మావత్ చిత్రం . దీపికా పడుకునే ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి సంజయ్ లీనా భన్సాలీ దర్శకత్వం వహించాడు . 
 
ప్రీమియర్ షోలతో 5 కోట్లు వసూల్ చేసిన ఈ చిత్రం మొదటి రోజున 19 కోట్లు , శుక్రవారం రోజున 32 కోట్లు శనివారం రోజున 27 కోట్లు కొల్లగొట్టి మొత్తానికి 83 కోట్ల వసూళ్ల ని రాబట్టిందని తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేసాడు . ఇక ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు కూడా మంచి వసూళ్లు రాబట్టడం ఖాయం దాంతో అవలీలగా 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని నమ్ముతున్నారు ట్రేడ్ విశ్లేషకులు . మొత్తానికి పలు వివాదాలు , విద్వాంసాలు సృష్టిస్తున్న ఈ చిత్రం భారీ వసూళ్ల ని సాధిస్తుండటంతో ఆ చిత్ర బృందం సంతోషంగా ఉన్నారు .