యుద్దానికి సిద్ధమంటున్న ఇమ్రాన్ ఖాన్


Pakistan PM Imran Khan sensational comments on Article 370
Pakistan PM Imran Khan sensational comments on Article 370

భారత్ తో యుద్దానికి సిద్ధం అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నాడు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ . కాశ్మీర్ విషయంలో అంతర్జాతీయ సమాజం మాట్లాడకపోయినా నేను కాశ్మీరీల తరుపున అంబాసిడర్ గా మారతానని అంటున్నాడు ఇమ్రాన్ . ఆర్టికల్ 370 ని రద్దు చేసి మోడీ ప్రభుత్వం దుస్సాహసానికి పూనుకుందని , కాశ్మీరీల కోసం భారత్ తో యుద్ధం చేయడానికి మా ఆర్మీ సిద్ధంగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేసాడు .

ఆర్టికల్ 370 ని రద్దు చేసి మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ నాయకులు ఉక్రోషంతో రగిలిపోతున్నారు . అందుకే భారత్ తో యుద్దానికి సిద్ధం అంటూ కవ్వింపు చర్యలకు దిగుతున్నారు . అయితే పాకిస్థాన్ సత్తా ఏంటో వాళ్లకు తెలుసు కాబట్టి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు . జిహాదీ ముసుగులో భారత్ ని దెబ్బతీసే భారీ కుట్రకు పాల్పడుతున్నారు . ఇక రేపు స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో దేశ వ్యాపారంగా హై అలెర్ట్ ప్రకటించింది భారత ప్రభుత్వం .