పాక్ అభిమాని ట్వీట్‌కి ఫిదా అయిన హీరో!పాక్ అభిమాని ట్వీట్‌కి ఫిదా అయిన హీరో!
పాక్ అభిమాని ట్వీట్‌కి ఫిదా అయిన హీరో!

త‌మిళంలో చిన్ని చిన్న పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటూ ఇప్ప‌డు క్రేజీ హీరోగా మారాడు విజ‌య్‌సేతుప‌తి. తెర‌పై న‌టిస్తున్న‌ట్టుగా కాకుండా బిహేవ్ చేస్తున్న‌ట్టుగా వుంటుంది. నేచుర‌ల్ యాక్ట‌ర్‌గా పేరున్న విజ‌య్‌సేతుప‌తి త్వ‌ర‌లో తెలుగు తెర‌పై త‌న‌దైన మార్కు విల‌నిజాన్ని కూడా ప‌రిచ‌యం చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో విజ‌య్ సేతుప‌తి ప‌వ‌ర్‌ఫుల్ విన‌ల్‌గా క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే.

విజ‌య్ హీరోగా న‌టిస్తున్న `మాస్ట‌ర్‌` చిత్రంలోనూ విజ‌య్ సేతుప‌తి విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో మంచి ఫ్యాన్ బేస్‌ని ఏర్పాటు చేసుకున్న విజ‌య్ సేతుప‌తికి ప‌క్క దేశం పాక్‌లోనూ అభిమానులున్నారు. అక్క‌డ విజ‌య్ సేతుప‌తి సినిమాల‌కు మంచి క్రేజ్ వుంద‌ట‌. ఇదే విష‌యం తాజాగా బ‌య‌ట‌ప‌డింది.

పాక్ చెందిన ఓ జారా అనే ఓ అభిమాని విజ‌య్‌పై వున్న ప్రేమ‌ని సోష‌ల్ మీడియా ట్విట్టర్ ద్వారా వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. `సేతు గారు మీ స్వ‌స్థ‌లం టీన‌గ‌ర్‌తో పాటు సౌత్‌లో మంచి ఫ్యాన్ బేస్‌ని పొందారు. నేనూ మీకు అభిమానినే. అయితే నేను త‌మిలియ‌న్‌ని కాదు. ఇండియ‌న్‌ని కాదు. పాక్‌లోని రాహోర్‌కు చెందిన అభిమాన‌ని, మీ సినిమాల‌న్నీ చూశాను. చూస్తున్నాను. వెరీ టాలెంటెడ్ యాక్ట‌ర్ మీరు` అని ట్విట్ చేసింది. పాక్ అభిమాని ట్వీట్‌కి ఫిదా అయిపోయిన విజ‌య్ సేతుప‌తి థ్యాంక్యూ సో మ‌చ్ అంటూ రిప్లై ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.