డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌లో ఆక‌ట్టుకుంటోంది..


డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌లో ఆక‌ట్టుకుంటోంది..
డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌లో ఆక‌ట్టుకుంటోంది..

వెండితెర‌పై ఆక‌ట్టుకున్న సినిమాలు బుల్లితెర‌పై కూడా మంచి ఆద‌ర‌ణ‌ను చూర‌గొంటున్నాయి. అలాగే స్టార్స్‌తో సంబంధం లేకుండా కొత్త వాళ్ల‌లో కొత్త కాన్సెప్ట్‌ల‌తో కూపొందిన చిత్రాలు చాలా వ‌ర‌కు విజ‌యాల్ని సాధించాయి. ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల‌లోనూ త‌మ స‌త్తాని చాటుతున్నాయి. అలా ఈ మ‌ధ్య కాలంలో విడుద‌లైన చిత్రం `ప‌లాస 1978` డిజిట‌ల్‌ మీడియాలో ఆక‌ట్టుకుంటోంది.

ర‌క్షిత్‌, న‌క్ష‌త్ర, ర‌ఘు కుంచె, తిరువీర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై విమ‌ర్శ‌కుల ప్ర‌శంప‌ల్ని సొంతం చేసుకుంది. 90వ ద‌శ‌కం నేప‌థ్యంలో ప‌లాస‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌నల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రం ద్వారా క‌రుణ కుమార్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు.

ఈ మూవీ విడుద‌ల‌కు ముందే గీతా ఆర్ట్స్ 2లో క‌రుణ‌కుమార్‌కు మ‌రో సినిమా ఓకే అయ్యేలా చేసింది. విమ‌ర్శ‌కుల‌ని సైతం మెప్పించిన ఈ చిత్రం ఇటీవ‌ల డిజిట‌ల్ ఓటీటీ అయిన‌ అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైంది. య‌దార్ధ సంఘ‌ట‌న‌లకు క‌ల్పిత స‌న్నివేశాల్ని జోడించి  తెర‌కెక్కించిన ఈ చిత్రం డిజిట‌ల్ ప్లాట్ ఫామ్‌లోనూ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటోంది. థియేట‌ర్స్‌లో మిస్స‌యిన ప్రేక్ష‌కులు ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు.  ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రాన్ని త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స‌మ‌ర్పించారు.