మరో టాలీవుడ్ సంచలనం పలాస 1978


మరో టాలీవుడ్ సంచలనం పలాస 1978
మరో టాలీవుడ్ సంచలనం పలాస 1978

చిన్న సినిమాలు ఉంటాయి పెద్ద సినిమా లో ఉంటాయి. మంచి సినిమాలు కూడా ఉంటాయి కానీ గొప్ప సినిమాలు మాత్రం అరుదుగా ఉంటాయి పలాస సినిమా ఖచ్చితంగా గొప్ప సినిమా అని డైరెక్టర్ మారుతి అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలాస సినిమా లో రక్షిత్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించారు కరుణ్ కుమార్ గారు దర్శకత్వం వహించారు. ధ్యానం అట్లూరి గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించగా, టాలీవుడ్ సీనియర్ టెక్నీషియన్ తమ్మారెడ్డి భరద్వాజ గారు ఈ సినిమా సమర్పిస్తున్నారు ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ దర్శకుడు కరుణ కుమార్ తను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్లాడని అభినందించారు. ఇది ఖచ్చితంగా మరొక అసురన్ లాంటి సినిమా అవుతుందని అభిలషించారు. ఇక ఈ సినిమా హీరో రక్షిత గారు మాట్లాడుతూ సినిమా చూశాక అల్లు అరవింద్ గారు మరియు దర్శకుడు సుకుమార్ గారు తనను ఫోన్ చేసి అభినందించారని వారు ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు. ఇక ఈ సినిమాను జీఏ 2 బ్యానర్ పై బన్నీ వాసు గారు మరియు యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రమోద్ గారు విడుదల చేయడం పట్ల ఇండస్ట్రీలో ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ సంగీత దర్శకులు, గీత రచయిత అయిన రఘు కుంచే గారు ఈ సినిమాలో ఒక మంచి పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా పలాస 1978 సినిమాలోని పాత్రలను యానిమేటెడ్ బుక్ రూపంలో విడుదల చేశారు.