గుణ‌శేఖ‌ర్ – స‌మంత‌ల `శాకుంత‌లం` మొద‌లైంది!

గుణ‌శేఖ‌ర్ - స‌మంత‌ల `శాకుంత‌లం` మొద‌లైంది!
గుణ‌శేఖ‌ర్ – స‌మంత‌ల `శాకుంత‌లం` మొద‌లైంది!

గుణ‌శేఖ‌ర్ తెర‌కెక్కిస్తున్నవిజువ‌ల్ వండ‌ర్ `శాకుంత‌లం`. స‌మంత అక్కినేని టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోంది. మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ దుష్యంతుడిగా క‌నిపించ‌బోతున్నారు. తెలుగులో ఇదే ఆయ‌న‌కు తొలి చిత్రం. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో డీఆర్‌పీ, గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై నీలిమా గుణ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది.

పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం చిత్రీక‌రించిన ముహూర్త‌పు స‌న్నివేశానికి అల్లు అర‌వింద్ క్లాప్ నిచ్చారు. చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ మాట్లాడుతూ ` `శాకుంత‌లం` అనే పాన్ ఇండియా ఫిల్మ్‌ని ప్రారంభించ‌డం ఆనందంగా వుంది. ఈ మూవీని డీఆర్‌పీ అంటే దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌, గుణ టీమ్ వ‌ర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దిల్ రాజు గారి లాంటి మేక‌ర్ ఈ సినిమాకు వెన్నుద‌న్నుగా నిల‌బ‌డ‌టం.. నా లాంటి ద‌ర్శ‌కుడికి నిర్మాణ విలువ‌ల్లో ఇలాంటి నిర్మాత ప్రోత్సాహం వుంటే అది ఏ స్థాయిలో వుంటుందో మీకు తెలిసిందే. `శాకుంత‌లం` పాత్రకు అత్య‌ధి శాతం మంది స‌మంత‌నే సూచించారు. నీలిమ కూడా స‌మంత అయితేనే బాగుంటుంద‌ని చెప్పింది. దాంతో ఓ రోజు స‌మంత‌కు క‌థ వినిపించాను. విన్న వెంట‌నే ఆమె నేను చేస్తున్నాను అంది. దిల్ రాజు క‌థ విని ఈ చిత్రానికి ఎంత బ‌డ్జెట్ అయితే అంత పెట్టండి అన్నారు` అని తెలిపారు.

`గుణశేఖ‌ర్ క‌థ చెబుతున్న‌ప్పుడే విజువ‌లైజ్ చేసుకున్నాను. ఆ పాత్ర‌లో స‌మంత‌ను ఊహించుకున్న‌ప్పుడు చాలా ప్రొటెన్షియాలిటీ వున్న సినిమా అనిపించింది. ఒక అద్భుత‌మైన సినిమా అవుతుంద‌నిపించింది. దీంతో నేను ఈ ప్రాజెక్ట్‌లో క‌లుస్తాన‌ని గుణ‌శేఖ‌ర్‌తో అన్నాను. మీరు క‌లిస్తే సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ‌తాన‌ని గుణశేఖ‌ర్ అన్నారు. 2022లో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం` అని దిల్ రాజు తెలిపారు. 50 చిత్రాలకు పైగా న‌టించిన నాకు పిరియ‌డ్ ఫిల్మ్ చేయ‌గ‌ల‌నా అనిపించేది. అలాంటి సినిమాలో ప్రిన్సెస్‌గా న‌టించాల‌ని వుండేది. ఇన్నేళ్ల నా కెరీర్‌లో `శాకుంత‌లం` దిల్‌రాజు, గుణ‌శేఖ‌ర్ నాకు ఇచ్చిన బెప్ట్ గిఫ్ట్` అని స‌మంత తెలిపారు.