ఆరు కోట్ల కారుని సంతం చేసుకున్న ప్ర‌భాస్‌!

ఆరు కోట్ల కారుని సంతం చేసుకున్న ప్ర‌భాస్‌!
ఆరు కోట్ల కారుని సంతం చేసుకున్న ప్ర‌భాస్‌!

ప్రీమియం లగ్జరీ కారు లంబోర్ఘిని అవెంటడార్ ఎస్ రోడ్‌స్టర్‌ని పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ సొంతం చేసుకున్నారు. మోస్ట్ ల‌గ్జ‌రీ కారుకు ప్రభాస్ ఓన‌ర్ అయ్యారు. ప్రపంచంలో చాలా కొద్దిమంది మాత్రమే ఈ కారును కలిగి ఉన్నారు. అలాంటి ఈ లగ్జరీ కారును  ప్ర‌భాస్ తాజాగా కొనుగోలు చేశాడు. ఇందు కోసం ఆయన రూ .6 కోట్లు ఖర్చచేరని తెలిసింది.

ఈ మెరిసే అరాన్సియో అట్లాస్ (ఆరెంజ్ పెర్ల్) రంగు లంబోర్ఘిని అవెంటడార్ ఎస్ రోడ్‌స్టర్‌లో అతను హైదరాబాద్ వీధుల్లో స‌ర‌దాగా విహ‌రించ‌నున్నారు. దీంతో ఇంత లగ్జరీ బ్రాండ్ కారును కలిగి ఉన్న ఏకైక దక్షిణ భారత స్టార్ గా ప్ర‌భాస్ రికార్డు సాధించారు.  బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ ఇటీవల లంబోర్ఘిని కార్‌ని సొంతం చేసుకున్నారు.

ఆ త‌రువాత ద‌క్షిణాదిలో ఈ కార్‌ని ద‌క్కించుకున్న స్టార్ ప్ర‌భాస్‌. `బాహుబ‌లి` త‌రువాత ప్ర‌భాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. అంతే కాకుండా భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ప్రభాస్ ఒకరుగా నిలిచారు. తను ఒక చిత్రం కోసం రూ .75 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం ‘సాలార్’, ‘ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ రూపొందిచ‌నున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రాల్లో నటిస్తున్నారు.