వాల్మీకి’లో ఆ సీన్ కు గబ్బర్ సింగ్ స్ఫూర్తి


valmiki-scene-inspired-from-gabbar-singh
valmiki-scene-inspired-from-gabbar-singh

వరుణ్ తేజ్ పూర్తి నెగటివ్ షేడ్ లో నటిస్తున్న తాజా చిత్రం వాల్మీకి. తమిళ్ చిత్రం జిగర్తాండకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ కొన్ని అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా వాల్మీకి సినిమాలోని కామెడీ ఎపిసోడ్ కు సంబంధించిన అప్డేట్ జనాలను ఆకర్షిస్తోంది.

హరీష్ శంకర్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కు పెద్ద పీట వేస్తాడన్న విషయం తెల్సిందే. గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డీజే సినిమాలు ఎంటర్టైన్మెంట్ ప్రధానంగానే సాగుతాయి. అందుకే వాల్మీకి సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్ ను బేస్ చేసుకునే తీసాడు హరీష్. నిజానికి జిగర్తాండలో కామెడీ సీన్లు తక్కువే. ఉన్నా కూడా క్రైమ్ కామెడీ తరహాలో ఉంటుంది.

అయితే ఇందులో మాత్రం హరీష్ శంకర్ సెపరేట్ కామెడీ ట్రాక్ ను పెట్టాడట. గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి ఎపిసోడ్ తరహాలో ఈ చిత్రంలో పేరడీ ఎపిసోడ్ ను పెట్టాడట. సినిమాలో ఈ ఎపిసోడ్ హిలేరియస్ గా ఉంటుందని సమాచారం. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో తమిళ్ హీరో అధర్వ మెయిన్ రోల్ చేస్తున్నాడు.