అరవింద సమేత ఫ్లాప్ కావడానికి రీజన్ ఇదేనట!

Paruchuri gopalakrishna sensational comments on ntr' s filmఅరవింద సమేత వీర రాఘవ చిత్రం అనుకున్న స్థాయిలో హిట్ కాకపోవడానికి కారణం ఏంటో తెలుసా …….. సినిమా ప్రారంభంలోనే కైమక్స్ ని చూపించారు . సినిమా ప్రారంభం నుండి దాదాపు 20 నిమిషాల సేపు అద్భుతంగా ఉంది కానీ దాని తర్వాత సినిమా ఎలా ఉండబోతోందో ముందే చూపించారు అందుకే అరవింద సమేత ఫ్లాప్ అయ్యిందని , అయితే స్క్రీన్ ప్లే పరంగా మార్పులు చేసి ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యుండేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ . పరుచూరి బ్రదర్స్ లో చిన్నవాడైన పరుచూరి గోపాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు . ఈ రచయిత ఇలా కామెంట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా …….

ఎన్టీఆర్ మాస్ హీరో అందుకు తగ్గట్లుగా స్క్రీన్ ప్లే ని మార్చి మొదట ప్రేమ సన్నివేశాలను చూపించి ఆ తర్వాత ఫ్యాక్షన్ , యాక్షన్ దృశ్యాలు చూపిస్తే సినిమా రేంజ్ మరోలా ఉండేదని అసలు విషయాన్నీ చెప్పాడు . నిజమే పరుచూరి గోపాలకృష్ణ చెప్పినట్లుగా స్క్రీన్ ప్లే లో మార్పులు చేసి ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యుండేది . దసరా సెలవులు అరవింద సమేత చిత్రానికి బాగా కలిసి వచ్చాయి . లేదంటే దారుణమైన కలెక్షన్లు వచ్చి ఉండేవి . ఒక్క నైజాం లో తప్ప మిగతా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ కాలేదు దాంతో అరవింద సమేత యావరేజ్ గానే మిగిలిపోయింది .

English Title: Paruchuri gopalakrishna sensational comments on ntr’ s film