ఆరేళ్ల త‌రువాత ప‌ట్ట ప‌గ‌లు `ఆర్జీవీ దెయ్యం`!

ఆరేళ్ల త‌రువాత ప‌ట్ట ప‌గ‌లు `ఆర్జీవీ దెయ్యం`!
ఆరేళ్ల త‌రువాత ప‌ట్ట ప‌గ‌లు `ఆర్జీవీ దెయ్యం`!

వ‌ర్మకు నో ఎథిక్స్‌.. నో లాజిక్స్‌.. చెయ్యాల‌నుకుంది చేసేయ‌డం.. చెప్పాల‌నుకుంది చెప్పేయ‌డం.. వ‌ద్ద‌నుకుంది బ‌య‌టికి తీయ‌డం.. కామ్‌గా వున్న వాళ్ల‌ని వివాదాల్లోకి లాగ‌డం.. గ‌త కొంత కాలంగా వ‌ర్మ‌కివి స‌ర్వ‌సాధార‌ణం అయ్యాయి. ఎప్ప‌టిలాగే వ‌ర్మ గ‌త కొన్నేళ్ల క్రితం అంటే 2014లో డా. రాజ‌శేఖ‌ర్‌, స్వాతీ దీక్షిత్‌ల‌తో `ప‌ట్ట ప‌గ‌లు` పేరుతో ఓ హార‌ర్ థ్రిల్ల‌ర్‌ని రూపొందించారు.

ఆ తరువాత ఆర్జీవీకి, రాజ‌శేఖ‌ర్‌కి మ‌ధ్య వివాదం త‌లెత్త‌డంతో ఈ సినిమా గ‌త ఆరేళ్లుగా వెలుగులోకి రాలేదు. తాజాగా వ‌ర్మ మ‌రోసారి ఈ చిత్రాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాడు. అయితే `ప‌ట్ట ప‌గ‌లు` పేరుని మార్చి `ఆర్జీవీ దెయ్యం` పేరుతో రిలీజ్ చేయ‌డానికి రెడీ అయ్యాడు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసిన ఈ చిత్రం ఈ నెల 16న హ‌డావిడీగా విడుద‌ల కాబోతోంది.

ఆరేళ్ల క్రితం రెడీ అయిన ఈ మూవీని ఇప్పుడెందుకు వ‌ర్మ హ‌డావిడీగా రిలీజ్ చేస్తున్నాడన్న‌ది మాత్రం ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. ఇంత‌కీ రాజ‌శేఖ‌ర్‌కి, వ‌ర్మ‌కి మ‌ధ్య ఈ ప్రాజెక్ట్ విష‌యంలో గొడ‌వ ఎందుకు జ‌రిగింది? .. రాజ‌శేఖ‌ర్‌కు వ‌ర్మ చెప్పిన క‌థ‌కి, తీసిన దానికి సంబంధం లేదా? అందుకే రాజ‌శేఖ‌ర్ .. వ‌ర్మ‌తో గొడ‌వ‌కు దిగాడా? అన్న‌ది ఇప్ప‌టికే స‌స్పెన్స్‌గానే మిగిలిపోయింది. మ‌రి పేరు మార్చి రిలీజ్ చేస్తున్న ఈ సినిమాపై రాజ‌శేఖ‌ర్ ఎలా స్పందిస్తారో చూడాలి.